Fired by Employer: ఉద్యోగం నుంచి తీసేసినందుకు ఊర్లో బస్సు యజమాని ఇజ్జత్ తీసేశాడు! బస్సు నేమ్‌ బోర్డులో బూతు పదం రాసి ఊరంతా తిప్పిన ఉద్యోగి, వెళ్తూ వెళ్తూ కంప్యూటర్ పాస్‌వర్ట్ మార్చడంతో రూ.55వేలు నష్టపోయిన యజమాని

ఇందుకోసం బస్సు ముందు భాగంలో ఉండే డిస్ప్లే బోర్డును (Bus name board) మార్చాడు. గతంలో సుఖేజా బస్సు సర్వీసు (Bus Service) అని ఉండే ఆ బోర్డులో ఓ బూతు పదాన్ని వాడాడు. అంతేకాదు వెళ్తూ వెళ్తూ ఆ డిస్ల్పేను ఆపరేట్ చేసే సీపీయూ పాస్ వర్డ్ ను కూడా మార్చివేశాడు.

Screen garb from viral video

Indore, OCT 20:  ఉద్యోగం నుంచి తీసేశాడనే కోపంతో యజమానిపై విచిత్రంగా పగతీర్చుకున్నాడు ఓ ఉద్యోగి (Employer). తనను జాబ్ నుంచి తీసేసిన యజమాని పరువు తీయడమే కాదు, ఏకంగా రూ.55వేలు లాస్ చేశాడు. ఇంతకీ అతను ఏం చేశాడంటే..మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) సంతా నుంచి ఇండోర్‌కు (Satna) రెగ్యులర్‌గా నడిచే సుఖేజా బస్సు సర్వీస్‌ లో పనిచేస్తున్న ఓ వ్యక్తిని యజమాని ఉద్యోగం నుంచి తీసేశాడు. జాబ్ నుంచి తీసేసే సమయంలో అతనితో గొడవపడ్డాడు. అంతేకాదు అతన్ని దుర్భాషలాడాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఉద్యోగి...తన యజమానికి బుద్దిచెప్పాలనుకున్నాడు. ఇందుకోసం బస్సు ముందు భాగంలో ఉండే డిస్ప్లే బోర్డును (Bus name board) మార్చాడు. గతంలో సుఖేజా బస్సు సర్వీసు (Bus Service) అని ఉండే ఆ బోర్డులో ఓ బూతు పదాన్ని వాడాడు. అంతేకాదు వెళ్తూ వెళ్తూ ఆ డిస్ల్పేను ఆపరేట్ చేసే సీపీయూ పాస్ వర్డ్ ను కూడా మార్చివేశాడు. దాంతో ఆ బూతు పదం బోర్డుతోనే (Cuss Word) బస్సు నడిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

దీంతో అప్పటికే తిట్టి ఉద్యోగం నుంచి తీసేసిన ఎంప్లాయిని పాస్‌ వర్ట్ చెప్పమని యజమాని కోరాడు. కానీ అతను పాస్ వర్ట్ చెప్పేందుకు నిరాకరించడంతో చేసేదేమీ లేక...కొత్త సీపీయూ  (CPU) కొన్నాడు. అయితే బస్సు నేమ్ బోర్డుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారడంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. జాబ్ నుంచి తీసేసినందుకు భలే పగ తీర్చుకున్నాడంటూ కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఇన్నాళ్లూ పని చేసిన యజమానిని ఇలా అవమానించడం కరెక్ట్ కాదు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇండోర్‌లో ఈ బస్సు సర్వీస్‌కు మాత్రం ఫుల్ పబ్లిసిటీ వచ్చింది.