Jellyfish: ఉన్నట్టుండి పడవను చుట్టుముట్టిన లక్షలాది తెల్లని జీవులు.. ఇజ్రాయెల్ పరిశోధకులు హడల్.. చివరకు విషయం తెలుసుకొని కూల్

ఒక్కసారిగా జరిగిన పరిణామానికి తొలుత భయపడిపోయిన బృందం.. కొద్ది సమయంలోనే తేరుకుంది. అవి జెల్లీఫిష్‌లని నిర్ధారించుకున్నాక ఊపిరి పీల్చుకున్నారు.

Jellyfish (Photo Credits: Reuters Twitter)

Jerusalem, August 2: తూర్పు మధ్యధరా సముద్రం మీదుగా  ఇజ్రాయెల్‌ కు చెందిన నేషన్స్‌ పార్క్స్‌ అండ్‌ నేచర్‌ అథారిటీ టీం ఓ పడవలో ప్రయాణం సాగిస్తున్నారు. నీలి ఆకాశం రంగు పులుముకొని స్వచ్చమైన సముద్రపు నీరు మెరిసిపోతుంది. ఇంతలో మూడు, నాలుగు తెల్లని జీవులు వాళ్ళ పడవ చుట్టూ చేరాయి. అవి ఏంటా? అని తీక్షణంగా పరిశీలించే లోపు.. లక్షల జీవులు వాళ్ళ పడవను చుట్టుముట్టాయి. ఒక్కసారిగా జరిగిన పరిణామానికి తొలుత భయపడిపోయిన బృందం.. కొద్ది సమయంలోనే తేరుకుంది. అవి జెల్లీఫిష్‌లని నిర్ధారించుకున్నాక ఊపిరి పీల్చుకున్నారు.

ఇదేమి చోద్యం, ఏం తోచడం లేదని 63 రూపాయి బిళ్లలను మింగేశాడు, తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి పరిగెత్తిన యువకుడు, ఎండోస్కోపిక్ ప్రక్రియ సహాయంతో వాటిని తొలగించిన వైద్యులు

జెల్లీఫిష్‌లు వాస్తవానికి మహా సముద్రాల్లో లోతైన ప్రాంతాల్లో ఉంటాయి, కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల  ఈ జెల్లిఫిష్‌లు అధిక సంఖ్యలో పెరిగిపోయి.. నీటి ఉపరితలానికి వస్తున్నాయి. అకశేరుకాలైన వీటికి మెదుడు ఉండదు. వాటి శరీరంలో మొత్తం దాదాపు 95% నీరు ఉంటుంది. అందుకే అవి పారదర్శకంగా, కొంత తెలుపు రంగులో కనిపిస్తాయి. అన్నట్టు.. నేషన్స్‌ పార్క్స్‌ అండ్‌ నేచర్‌ అథారిటీ బృందం ఈ జెల్లీఫిష్‌ల వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది నెట్టింట్లో వైరల్ గా మారింది.