Electricity Consumption: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 దేశాల కంటే ఎక్కువ విద్యుత్తు వాడేస్తున్న గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌

అలాంటిది దేశం మొత్తం ఎంత కరెంట్ వినియోగంలో ఉంటుందో, దానికి ఎంత బిల్లు అవుతుందో ఊహించగలమా? అయితే, టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ విద్యుత్తు వినియోగం ఒక రేంజుకు చేరింది.

Power-Supply

Newdelhi, July 19: ఇంట్లో నాలుగు లైట్లు ఎక్కువ వేస్తేనే, కరెంట్ బిల్లు (Power Bill) తడిసిమోపెడవుతుంది. అలాంటిది దేశం మొత్తం ఎంత కరెంట్ వినియోగంలో (Electricity Consumption) ఉంటుందో, దానికి ఎంత బిల్లు అవుతుందో ఊహించగలమా? అయితే, టెక్‌ దిగ్గజాలు గూగుల్‌ (Google), మైక్రోసాఫ్ట్‌ (Microsoft) విద్యుత్తు వినియోగం ఒక రేంజుకు చేరింది. 2023లో ఈ రెండు కంపెనీలు 24 టెరావాట్‌ అవర్‌ విద్యుత్తును వినియోగించాయని తేలింది. ఈ వినియోగం ఎంతలా ఉందంటే.. దాదాపు 100కు పైగా దేశాలను మించి ఈ కంపెనీలు విద్యుత్తు వినియోగిస్తున్నట్టు లెక్క. ఆ రెండు కంపెనీలు మొత్తం 48 టెరావాట్‌ అవర్‌ విద్యుత్తును వాడుతున్నాయని పలువురు చెబుతున్నారు. కంపెనీల ఆదాయంలో ఎక్కువ మొత్తం ఈ బిల్లుల చెల్లింపులకే వెళ్తున్నట్టు వివరిస్తున్నారు.

వృద్ధాప్యానికి బైబై.. ఆయుష్షు పెంచే కొత్త ఔషధం.. 25 శాతం పెరిగిన ఎలుకల జీవితకాలం.. మరి మనుషుల్లో..?

ఎందుకు ఇంత వినియోగం?

డాటా సెంటర్లు, ఏఐ, క్లౌడ్‌ సర్వీసెస్‌ కార్యకలాపాలకు ఈ రెండు కంపెనీలు ఇంత మొత్తంలో విద్యుత్తును వినియోగిస్తున్నట్టు తేలింది. ఈ ప్రక్రియతో పెద్ద మొత్తంలో కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదలవుతున్నదని, ఇది పర్యావరణానికి హానిని కలిగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.

కరెన్సీ నోట్లను చించేసిన పిల్లలపై తండ్రి కోపం.. అల్లరి మాన్పించే ప్రయత్నంలో వింత నిర్ణయం.. ఉరేసుకుంటానని హెచ్చరిక.. పొరపాటున ఉరి బిగుసుకుని మృతి.. విశాఖలో వెలుగు చూసిన ఘటన



సంబంధిత వార్తలు

Power Treasure: వెయ్యేండ్ల విద్యుత్తుకు సరిపడా భూ అంతర్భాగంలో ట్రిలియన్ల హైడ్రోజన్‌ నిక్షేపాలు.. అమెరికా జియోలాజికల్‌ సర్వేలో వెల్లడి

KTR On Electricity Charges Hike: పదినెలలకే కరెంట్ ఛార్జీల పెంపా?, డిస్కంల ప్రతిపాదనలను తిరస్కరించాలని కేటీఆర్ డిమాండ్, విద్యుత్ ఛార్జీల పెంపును ప్రజల్లోనే ఎండగడతాం అని వెల్లడి

Artificial Plant Generates Electricity: కరెంటును ఉత్పత్తి చేసే కృత్రిమ మొక్క.. కార్బన్‌ డయాక్సైడ్‌ ను ఆక్సిజన్‌ గా మార్చగలదు కూడా.. అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు

Telangana: ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, విద్యా వ్యవస్థ ఇంకా మారాల్సి ఉందని తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క