Newyork, Oct 8: కరెంటును ఉత్పత్తి చేసే కొత్త రకమైన కృత్రిమ మొక్కను (Artificial Plant Generates Electricity) అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బయోబ్యాటరీలతో పని చేసే ఈ మొక్క ఇండోర్ లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాదు ఈ మొక్క కార్బన్ డయాక్సైడ్ ను తీసుకొని ఆక్సిజన్ (Oxygen) ను కూడా ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. ఈ కృత్రిమ మొక్కకు సంబంధించిన వివరాలు ‘అడ్వాన్స్‌డ్ సైస్టెనబుల్ సిస్టమ్స్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Artificial plant generates electricity to power devices, cleans indoor airhttps://t.co/Q5aXpuYiwB
— Interesting Engineering (@IntEngineering) October 7, 2024
విశేషాలు:
- మొక్క ఆకులు-5
- విద్యుత్తు ఉత్పత్తి - 140 మైక్రోవాట్లు
- వినియోగం- సెల్ ఫోన్ కు చార్జింగ్