groom covered his bald head with a wig

Gaya, July 12: పెళ్లి కొడుకు విగ్గుతో బట్టతలను దాచిపెట్టి పెళ్లికి సిద్ధమవడంతో విషయం తెలుసుకున్నవధువు తరపు బంధువులు మండపంలోనే అతన్ని చితకబాదారు. తనను వదిలేయమని ప్రాధేయపడినా వదల్లేదు. బీహార్‌ గయ జిల్లాలోని డోభీ పోలీస్ స్టేషన్ పరిధిలోఈ ఘటన చోటు చేసుకుంది. బజౌరా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనకు పెళ్లయిన విషయం దాచిపెట్టి ఓ యువతిని రెండోపెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. పైగా తనకున్న బట్టతలను దాచిపెట్టేందుకు చక్కగా విగ్గు ధరించి మండపానికి చేరుకున్నాడు. కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉంది.

డ్యూటీలో ఉన్నప్పుడు ఆ టోపీ ఎందుకు, ఇష్టముంటే మసీదులో లేదా ఇంట్లో పెట్టుకో, బస్ ముస్లిం కండక్టర్‌ను ప్రశ్నించిన బెంగుళూరు మహిళ

అయితే, అప్పటికే విషయం వధువు బంధువులకు తెలిసిపోయింది. అతడికి అప్పటికే వివాహం జరిగిందని, విగ్గు ధరించి రెండో పెళ్లికి తయారైనట్టు తెలిసి వధువు బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. అతడిని పట్టుకుని విగ్గు తొలగించి చితక్కొట్టారు. దెబ్బలకు తాళలేని పెళ్లికొడుకు తాను చేసింది తప్పేనని, వదిలేయాలని ప్రాధేయపడ్డాడు. విషయం తెలిసిన అతడి భార్య మండపానికి చేరుకుని అతడిని రక్షించి తీసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఈ విషయమై గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించారు.



సంబంధిత వార్తలు

AARAA Exit Poll: పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారంటున్న ఆరా మస్తాన్ సర్వే, లోకేష్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని వెల్లడి

Andhra Pradesh Assembly Exit Poll: ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, అధికార వైసీపీకే మొగ్గు చూపిన మెజార్టీ సర్వేలు

Telangana Exit Poll: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే టఫ్ పైట్, బీజేపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటున్న సర్వేలు

Lok Sabha Exit Poll: అధికార బీజేపీ కూటమికే పట్టం కట్టిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్ల మధ్య వస్తాయంటే..

Andhra Pradesh Lok Sabha Exit Poll: ఏపీలో లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..

Operation Chanakya Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన ఆపరేషన్ చాణక్య సర్వే, 95 నుంచి 102 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 64 నుంచి 68 సీట్ల మధ్యలో టీడీపీ

Chanakya Strategies Exit Poll: 114 నుంచి 125 సీట్లతో టీడీపీ అధికారంలోకి, 39 నుంచి 49 సీట్ల మధ్యలో వైసీపీ, Chanakya strategies Exit Poll ఇదిగో..

Avian Influenza Alert: ఏపీతో సహా నాలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ డేంజర్ బెల్స్, అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక, మానవులకూ సోకే ఆస్కారం ఉందని వెల్లడి