Haryana Shocker: హర్యానాలో దారుణం, పెళ్లి చేయలేదని తల్లిదండ్రులను గొడ్డలితో నరికిన కొడుకు, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

తనకు పెళ్లి చేయడం లేదని ఓ కొడుకు పొలంలో పని చేసుకుంటున్న తల్లిదండ్రులపై గొడ్డలితో (son chopped his parents) దాడి చేశాడు.తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Murder (Photo Credits: Pixabay)

Haryana, Mar 14: హర్యానాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు పెళ్లి చేయడం లేదని ఓ కొడుకు పొలంలో పని చేసుకుంటున్న తల్లిదండ్రులపై గొడ్డలితో (son chopped his parents) దాడి చేశాడు.తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హర్యానాలోని (Haryana) నార్నాల్‌కు చెందిన సుదీప్ అనే యువకుడు తనకు పెళ్లి కావడం లేదని (not getting married) ఆవేదన చెందేవాడు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయడం లేదని తీవ్ర ఆగ్రహం పెంచుకున్నాడు.

శుక్రవారం మధ్యాహ్నం తల్లిదండ్రులు పొలంలో పని చేసుకుంటుండగా కోపంతో అక్కడకు వెళ్లాడు. పెళ్లి (Marriage) గురించి తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవ పెద్దది కావడంతో వారిపై గొడ్డలితో దాడి చేశాడు.

అల్లుడు కాదు హంతకుడు, ఇంటికి వచ్చిన అత్తా మామలపై కత్తితో దాడి, అడ్డు వచ్చిన భార్యపై అటాక్, దాడిలో భార్య, అత్త మృతి, మామకు తీవ్ర గాయాలు

ఆ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన వారిద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరికీ ప్రాణాపాయం తప్పినట్టు వైద్యులు తెలిపారు. కుమారుడిపై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న సుదీప్ కోసం గాలిస్తున్నారు.