Hyderabadi Valentine: ప్రేమ కోసం ఇస్లాం మతానికి మారిన యువకుడు, అయినా తిరస్కరించిన యువతి తల్లిదండ్రులు, మానవ హక్కుల సంఘానికి యువకుడి ఫిర్యాదు
ఈ క్రమంలో భాస్కర్ ఏడాది క్రితమే ముస్లిం మతంలోకి మారాడు. తన పేరును మహ్మద్ అబ్దుల్ గా మార్చుకున్నాడు....
Hyderabad, February 03: మహ్మద్ అబ్దుల్ హునైన్ అలియాస్ బొబ్బిలి భాస్కర్ తన ప్రేమకోసం ఎంతదూరం అయినా వెళ్తానంటున్నాడు. హైదరాబాద్ కు చెందిన 26 ఏళ్ల భాస్కర్ 11 ఏళ్లుగా ఒక అమ్మాయిని ఘాడంగా ప్రేమిస్తున్నాడు, ఆమె కూడా ఇతణ్ని అంతే ఘాడంగా ప్రేమిస్తుంది. ఇద్దరూ కలిసి తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియపరిచారు. అయితే వీరి ప్రేమకు 'మతం' అనే చిక్కు అడ్డుపడింది. భాస్కర్, క్రిస్టియన్ (Christian) మతాన్ని విశ్వసించే తల్లిదండ్రులకు పుట్టాడు. ఇతడు ప్రేమించే అమ్మాయి ముస్లిం (Muslim Woman). దీంతో మతాలు వేరవడంతో పెద్దలు వీరి ప్రేమను తిరస్కరించారు. ముఖ్యంగా యువతి తల్లిదండ్రుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది.
తాము ఒకరిని విడిచి ఒకరం ఉండలేం అని యువతి తండ్రిని భాస్కర్ బ్రతిమిలాడగా, ముస్లిం మతంలోకి కన్వర్ట్ (religion conversion) అయితే పెళ్లి చేస్తానని చెప్పాడట. ఈ క్రమంలో భాస్కర్ ఏడాది క్రితమే ముస్లిం మతంలోకి మారాడు. తన పేరును మహ్మద్ అబ్దుల్ గా మార్చుకున్నాడు. ప్రతిరోజు మసీదుకు వెళ్లడం, నిష్టగా నమాజ్ పటనం చేయడం చేస్తున్నాడు.
Here's his story:
ఇప్పుడు పెళ్లి చేయండటూ యువతి తండ్రిని మరోసారి సంప్రదిస్తే, ఆయన మాట మార్చారు, తనపై దాడి చేసి వెళ్లగొట్టారు. కనీసం ప్రేమించిన వ్యక్తితో మాట్లాడేందుకు కూడా అనుమతించడం లేదు. ఆమెను చూసి కూడా 10 నెలలు అవుతోంది. ఆమె బ్రతికే ఉందా చంపేశారా? అనే అనుమానం కలుగుతుందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు.