ICMR Diabetes Bio-Bank: దేశంలో తొలి డయాబెటిస్ బయోబ్యాంక్.. చెన్నైలో స్థాపించిన ఐసీఎంఆర్.. ఎందుకు? దీని లక్ష్యలేంటి?
డయాబెటిస్ కు సంబంధించి శాస్త్రీయ పరిశోధనలను మరింత బలపరిచే లక్ష్యంతో ప్రజలకు సంబంధించిన జీవసంబంధ నమూనాలను భద్రపరిచే దేశంలోనే తొలి డయాబెటిస్ బయో బ్యాంకును భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) చెన్నైలో స్థాపించింది.
Chennai, Dec 17: డయాబెటిస్ (Diabetes) కు సంబంధించి శాస్త్రీయ పరిశోధనలను మరింత బలపరిచే లక్ష్యంతో ప్రజలకు సంబంధించిన జీవసంబంధ నమూనాలను భద్రపరిచే దేశంలోనే తొలి డయాబెటిస్ బయో బ్యాంకును (ICMR Diabetes Bio-Bank) భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) చెన్నైలో స్థాపించింది. మద్రాసు డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఎండీఆర్‌ఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో ఈ బయోబ్యాంకు ఏర్పడింది.ఐసీఎంఆర్ అనుమతితో శాస్త్రీయ పరిశోధనలకు ఈ బయోబ్యాంకు తోడ్పాటును అందిస్తుంది.
లక్ష్యాలు ఇవే..
- బయోస్పెసిమెన్ల సేకరణ
- బయోస్పెసిమెన్లను ప్రాసెస్ చేయడం
- బయోస్పెసిమెన్లను భద్రపరచడం-పంపిణీ చేయడం
ఏం పరిశోధనలు చేస్తారు?
డయాబెటిస్ వచ్చేందుకు కారణాలు, డయాబెటిస్ లో భారతీయ రకాలకు చెందిన తేడాలు, సంబంధిత రుగ్మతలను బయోబ్యాంకు సాయంతో ఆధునిక పరిశోధనలు జరుగుతాయి.