INS Mormugao Commissioned: నౌకాదళంలో చేరిన శత్రు భీకర యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ మోర్ముగావో’.. మరింత బలోపేతం దిశగా భారత రక్షణ రంగం

దేశీయంగా నిర్మించిన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ‘ఐఎన్ఎస్ మోర్ముగావో’ నిన్న నౌకాదళంలో అడుగుపెట్టింది.

Credits: Twitter

Newdelhi, Dec 19: పక్కలో బల్లెంలా మారిన పాకిస్తాన్ (Pakisthan), చైనా (China) ఆగడాలకు చెక్ పెట్టేందుకు భారత్ (India) దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఆయుధ సంపత్తిని క్రమంగా పెంచుకుంటున్నది. ఇందులో భాగంగా దేశీయంగా నిర్మించిన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ‘ఐఎన్ఎస్ మోర్ముగావో’ (INS Mormugao) నిన్న నౌకాదళంలో (Navy) అడుగుపెట్టింది (Commissioned). ‘విశాఖపట్టణం’ క్లాస్ డిస్ట్రాయర్‌లో రెండోదైన ఈ భారీ నౌకను ముంబైలో నిన్న జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నౌకాదళంలో ప్రవేశపెట్టారు. తద్వారా భారత రక్షణ రంగం మరింత బలోపేతమైనట్టు అయింది.

ఇదేందయ్యా.. ఇది.. ప్రారంభానికి ముందే బ్రిడ్జి కూలడమేంటి? బీహార్ లో ఘటన.. వీడియోతో

నాలుగు శక్తిమంతమైన గ్యాస్ టర్బైన్లతో నడిచే ఈ నౌక గంటకు 30 నాట్ల (55 కిలోమీటర్లు)కు పైగా వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో అధునాతన సెన్సార్లు, ఆయుధాలు ఉన్నాయి. అలాగే, నిఘా రాడార్ వ్యవస్థ కూడా ఉంది. ఉపరితలం నుంచి ఉపరితలం, ఉపరితలం నుంచి గగన లక్ష్యాలపై ఇది క్షిపణులను సంధించగలదు. అంతేకాదు అణు, జీవ రసాయన యుద్ధ పరిస్థితుల్లోనూ పోరాడగలిగేలా దీనిని తీర్చి దిద్దారు.

తెలంగాణలో ‘హస్త’వ్యస్తం.. కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం... 12 మంది రాజీనామా.. రేవంత్ నాయకత్వానికి వ్యతిరేకంగానే..