 
                                                                 Hyderabad, Dec 19: తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ (Congress) మనుగడ అంతకంతకు ప్రశ్నార్థకంగా మారుతున్నది. హస్తం పార్టీలో ఎప్పటినుంచో ఉన్న అసంతృప్తులు ఇటీవల పీసీసీ కమిటీల (PCC Committee) ప్రకటన అనంతరం భగ్గుమన్నాయి. రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంపై ఇప్పటికే నిరసన గళం వినిపిస్తున్న పార్టీ సీనియర్లు (Party Seniors) ఇటీవల పరిణామాలతో ఆగ్రహంతో ఉన్నారు.
హిందూ పంచాంగంలో వచ్చే ఏడాది 13 నెలలు.. అధికంగా వచ్చిన ‘శ్రావణం’.. 19 సంవత్సరాలకు ఒకసారి ఇలా..
టీడీపీ నుంచి వచ్చిన వారికే తెలంగాణ కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగ్గా... 12 మంది నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఈ 12 మంది నేతలు గతంలో టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరినవారే!
మహారాష్ట్రలో దారుణం.. 16 ఏళ్ల బాలికపై 15 గంటలపాటు 8 మంది అత్యాచారం
రాజీనామా చేసిన వారిలో ధనసరి సీతక్క, విజయరామారావు, నరేందర్ రెడ్డి, ఎర్ర శేఖర్, చారగొండ వెంకటేశ్ తదితరులు ఉన్నారు. వీరు తమ రాజీనామా లేఖలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ కు పంపినట్టు తెలుస్తోంది.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
