Representational (Credits: Google)

Mumbai, Dec 19: మహారాష్ట్రలో (Maharastra) ఘోరం జరిగింది. 16 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఆమె 8 మంది స్నేహితులు (Friends) దాదాపు 15 గంటలపాటు అత్యాచారానికి (Rape) ఒడిగట్టారు. ప్రస్తుతం నిందితులందరూ పోలీసుల అదుపులో (Police Custody) ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే,  పాల్ఘర్ జిల్లాకు చెందిన బాధిత బాలికను కలిసిన ఓ మైనర్ స్నేహితుడు ఆమెకు మాయమాటలు చెప్పి సముద్ర తీర గ్రామంలోని ఓ ఖాళీ భవనంలోకి తీసుకెళ్లాడు.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే విన్నర్ గా నిలిచిన సింగర్ రేవంత్, రన్నర్ అప్ గా నిలిచిన శ్రీహాన్..

ఆ తర్వాత అక్కడికి మరో ఏడుగురు నిందితులు వచ్చారు.  ఆ తర్వాత అందరూ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను సముద్రం ఒడ్డుకు తీసుకెళ్లి మరోమారు అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రంతా దాదాపు 15 గంటలపాటు వేధింపులు ఎదుర్కొన్న బాలిక ఉదయం ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడు సహా ఎనిమిది మందినీ అదుపులోకి తీసుకున్నారు.

ఫిఫా వరల్డ్ కప్‌ మరోసారి అర్జెంటీనా కైవసం, ఫుల్ కిక్కిచ్చిన ఫైనల్ మ్యాచ్, షూటవుట్‌తో దుమ్మురేపిన అర్జెంటీనా, మెస్సీకి విక్టరీతో ఘన వీడ్కోలు

డిసెంబరు 16న ఈ ఘటన జరిగిందని, దాదాపు రాత్రి 7 గంటల సమయంలో బాలికపై మొదలైన లైంగిక దాడి తర్వాతి రోజు ఉదయం 11 గంటల వరకు కొనసాగిందని పోలీసులు తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.