Argentina Win FIFA World Cup 2022, (PIC @ Twitter FIFA 2022)

Qatar, DEC18: ఫిఫా ప్రపంచకప్ లో అర్జెంటీనా (Argentina) మరోసారి దుమ్మురేపింది. ఆదివారం రాత్రి ఫ్రాన్స్ తో (France) జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో విజయం సాధించి సుదీర్ఘ కాలం తర్వాత వరల్డ్ కప్ ను గెలుచుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో (ARG vs FRA Final) అర్జెంటీనా విక్టరీ కొట్టి (Argentina Win)...మెస్సీకి ఘనంగా వీడ్కోలు పలికింది. పెనాల్టీ షూటౌట్ కు దారి తీసిన ఈ మ్యాచ్ లో అర్జెంటీనా 4-2 తేడాతో ఫ్రాన్స్ పై విజయం సాధించింది.ఖతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ (FIFA World Cup 2022) ఉత్కంఠగా సాగింది. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది ఫైనల్‌ ఫైట్‌. ఫస్టాఫ్‌లో అర్జెంటీనా ఆధిపత్యం కొనసాగించింది. ఏకంగా రెండు గోల్స్‌ చేయగా.. ఫ్రాన్స్‌ గోల్స్ ఏమీ చేయలేకపోయింది. కానీ.. సెకండాఫ్‌లో నెమ్మదిగా పుంజుకుంది. బ్యాక్‌ టు బ్యాక్‌ గోల్స్‌తో ఆటగాళ్లలో ఉత్సాహం వచ్చింది. అర్జెంటీనా స్టార్‌ ప్లేయర్‌ మెస్సి(Messi).. మరోసారి మెస్మరైజ్‌ చేశాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో తొలి గోల్‌ కొట్టి.. అర్జెంటీనా అభిమానుల్లో జోష్‌ నింపాడు. అదే ఉత్సాహంతో ఆడిన ఆటగాళ్లు ఫ్రాన్స్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించారు.

ఫస్టాఫ్‌లో అర్జెంటీనా ప్లేయర్‌ డి-మారియా రెండో గోల్‌ చేశాడు. అలా ఫస్టాఫ్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది అర్జెంటీనా. ఫ్రాన్స్‌ కోలుకునేందుకు అవకాశమే ఇవ్వలేదు. సెకండాఫ్‌ నిర్ణీత సమయం ముగిసే సరికి ఫ్రాన్స్‌ కూడా రెండు గోల్స్‌ చేయడంతో సమయం పొడిగించారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో లియోనెల్ మెస్సీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒక ప్రపంచకప్‌ టోర్నీ‌లో గ్రూప్‌ లెవల్‌లో, క్వార్టర్‌ ఫైనల్స్‌లో, సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్‌ మ్యాచ్‌లోను గోల్‌ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

గ‌తంలో అర్జెంటీనా- ఫ్రాన్స్ జట్లు 12 సార్లు ఢీ కొన్నాయి. అర్జెంటీనా అత్య‌ధికంగా 6 మ్యాచుల్లో విజేత‌గా నిలిచింది. ఫ్రాన్స్ 3 మ్యాచుల్లో గెలిచింది. మిగ‌తా 3 మ్యాచుల్లో ఫ‌లితం తేల‌లేదు. అయితే ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో మాత్రం రెండు టీమ్‌లు మూడు మ్యాచుల్లో ఎద‌రుప‌డ్డాయి. అర్జెంటీనా 2, ఫ్రాన్స్ ఒక మ్యాచ్‌లో విజ‌యం సాధించాయి. తాజా గెలుపుతో అర్జెంటీనా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంతకుముందు అర్జెంటీనా 3-0తో క్రొయేషియాపై గెలిచి ఫైన‌ల్లోకి ప్ర‌వేశించింది. రెండో సెమీఫైన‌ల్లో ఫ్రాన్స్ 2-0తో మొరాకోను చిత్తు చేసింది. 2018 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ ఫ్రాన్స్ 4-2తో క్రొయేషియాను చిత్తు చేసి టైటిల్ అందుకుంది. 2014లో ఫైన‌ల్‌కు చేరిన అర్జెంటీనా 0-1తో జ‌ర్మ‌నీ చేతిలో ఓడిపోయింది.