Indian Gets 12 Years Jail in US: అమెరికాలో 13 ఏళ్ల చిన్నారితో సెక్స్ కోసం వెళ్లి అడ్డంగా బుక్కయిన భారత విద్యార్థి , 12 ఏళ్లు జైలు శిక్ష విధించిన యుఎస్ కోర్టు

ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్లి అక్కడ సెక్స్ ట్రాప్ లో చిక్కుకుని కటకటాలు లెక్కబెడుతున్నాడు.

Representative Image (Photo Credit: PTI)

US, July 26: 13 ఏళ్ల చిన్నారితో సెక్స్ కోసం ప్రయత్నించి అడ్డంగా దొరికినందుకు అమెరికాలో భారతీయ విద్యార్థికి 12 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్లి అక్కడ సెక్స్ ట్రాప్ లో చిక్కుకుని కటకటాలు లెక్కబెడుతున్నాడు. మైనర్‌ను అక్రమ లైంగిక కార్యకలాపాలకు ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన నేరంపై ఫెడరల్ కోర్టులో 32 ఏళ్ల భారతీయ పౌరుడికి 12 సంవత్సరాల జైలు శిక్షతో పాటుగా 10 సంవత్సరాల పర్యవేక్షణలో ఉండాలని తీర్పు విధించబడిందని US న్యాయవాది తెలిపారు.

యుఎస్ వార్తా కథనం ప్రకారం.. స్టూడెంట్‌ వీసా మీద అమెరికా వెళ్లిన ఉపేంద్ర ఆడూరు(32) భారత విద్యార్థి సోషల్‌ మీడియాలో 13 ఏళ్ల బాలిక అనుకుని ఓ వ్యక్తితో చాటింగ్‌ మొదలుపెట్టాడు. తన లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ఆ బాలికకు (రహస్య డిటెక్టివ్‌కు) సందేశాలు పంపాడు. అంతటితో ఆగకుండా ఆ ఖాతాకు అశ్లీల చిత్రాల మెసేజ్‌లు కూడా పెట్టాడు. ఓ రోజు ఆ బాలికను కలవడానికి మిల్‌క్రీక్ టౌన్‌షిప్‌లోని పార్కుకు వెళ్లాడు.  తిరుపతిలో దారుణం, స్నేహితురాలికి డ్రగ్స్ ఇచ్చి తన భర్తతో అత్యాచారం చేయించి వీడియోలు తీసిన భార్య, అనంతరం ఆ న్యూడ్ వీడియోలతో డబ్బులు డిమాండ్

అయితే ఇక్కడే అతడికి పెద్ద ట్విస్టు ఎదురైంది.లోపలికి వెళ్ళగానే బాలికకు బదులు యునైటెడ్ స్టేట్స్ అటార్నీ ఆఫీస్ అధికారులు దర్శనమిచ్చారు. మైనర్ల మీద లైంగికనేరాలకు పాల్పడే వారిని వలపన్ని పట్టుకునేందుకు ఓ ప్రైవేట్‌ డిటెక్టివ్‌ క్రియేట్‌ 13 ఏళ్ల బాలిక పేరుతో నకిలీ ఖాతా క్రియేట్ చేశారని తెలిసి షాకయ్యాడు. వెంటనే అతన్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13 మంది, 50 ఏళ్ళ హిజ్రాపై గ్యాంగ్ రేప్, 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరో 5 గురు పరారీలో..

అతడి ఫోన్‌ లాక్కుని అందులోని అశ్లీల వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారమంతా 2022 సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్‌ 6 మధ్యలో జరిగింది. ఈ కేసులో ఉపేంద్రకు 12 ఏళ్ల జైలు శిక్షతో పాటు రిలీజ్‌ అయిన తర్వాత మరో 10 ఏళ్లు పోలీసుల పర్యవేక్షణలో ఉండాలని కోర్టు తీర్పిచ్చింది. ఈ కేసు ప్రాజెక్ట్ సేఫ్ చైల్డ్‌హుడ్‌లో భాగంగా తీసుకురాబడింది, ఇది పిల్లల లైంగిక దోపిడీ, దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి న్యాయ శాఖ ద్వారా మే 2006లో దేశవ్యాప్తంగా ప్రారంభించబడింది.