ISRO Warning on Apophis: భూమివైపు దూసుకొస్తున్న భారీ అపోఫిస్ ఆస్టరాయిడ్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య కంటే పెద్దగా ఉందని తెలిపిన ఇస్రో చీఫ్ డా.ఎస్ సోమనాథ్

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం కంటే పెద్దగా ఉన్న ఆస్టరాయిడ్ అపోఫిస్ భూమికి అతి సమీపంలో దూసుకువెళుతుందని తెలిపింది.

ISRO Chief S Somnath (photo-ANI)

ఒక భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందంటూ ఇస్రో హెచ్చరికలు జారీ చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం కంటే పెద్దగా ఉన్న ఆస్టరాయిడ్ అపోఫిస్ భూమికి అతి సమీపంలో దూసుకువెళుతుందని తెలిపింది. 2029 ఏప్రిల్ 13న ఇది భూమికి అతి సమీపం నుంచి ప్రయాణించనుందని, దీనిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఇస్రో చీఫ్ డా.ఎస్ సోమనాథ్ వెల్లడించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇది భూమికి 32,000 కిలోమీటర్ల ఎత్తులో వెళుతుందని, అంటే భారత జియోస్టేషనరీ శాటిలైట్స్ పరిభ్రమించే కక్ష్యల కంటే దగ్గరగా ఈ ఆస్టరాయిడ్ ప్రయాణించే అవకాశాలు ఉన్నాయని ఇస్రో చీఫ్ చెప్పారు. ఇది భారత అతిపెద్ద విమాన వాహక నౌక అయిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య కంటే కూడా పెద్దగా ఉంటుందని చెప్పారు. ఈ గ్రహశకలం పరిమాణం సుమారు 340-450 మీటర్ల వ్యాసం కలిగి ఉండొచ్చని చెప్పారు. 140 మీటర్ల వ్యాసం కంటే పెద్దగా ఉన్న ఏ గ్రహశకలం భూమికి సమీపం నుంచి ప్రయాణించినా ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారని సోమనాథ్ చెప్పారు.

వాహనాలు చేసే రణగొణధ్వనులతో పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం.. తాజా అధ్యయనంలో వెల్లడి

నెట్‌వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ (NETRA) ఆస్టరాయిడ్ 'అపోఫిస్‌'ను నిశితంగా పర్యవేక్షిస్తోందని అన్నారు. భవిష్యత్తులో భూమికి పొంచివుండే ముప్పులను నివారించేందుకు భారత్ సిద్ధమని, ఈ మేరకు అన్ని దేశాలకు తమ సహకారం అందిస్తామని సోమనాథ్ చెప్పారు. కాగా ‘అపోఫిస్‌’ను తొలిసారి 2004లో గుర్తించారు. విలయాలు సృష్టిస్తాడని ఈజిప్ట్ ప్రజలు భావించే ‘అపోఫిస్’ అనే దేవుడి పేరును ఈ గ్రహశకలానికి పెట్టారు. ఈ గ్రహశకలం ముప్పు నుంచి తప్పించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా కృషి చేస్తోంది.