Newdelhi, Sep 7: మద్యం-పొగ తాగడం, మధుమేహం, ఊబకాయం, మారిన జీవనశైలి, ఒత్తిడి, రేడియేషన్ ఇప్పటివరకూ ఇవే పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అనుకొన్నాం. అయితే, వాహనాలు చేసే పెద్ద శబ్దాలు (Sound Pollution) కూడా పురుషుల సంతానోత్పత్తి (Infertility) సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని డెన్మార్క్ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో తేలింది. వాహన శబ్దాల కారణంగా 37 ఏండ్లు పైబడిన పురుషుల్లో వంధ్యత్వం పెరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. శబ్ద కాలుష్యం కారణంగా 35 ఏండ్లు పైబడిన మహిళల సంతానోత్పత్తి సామర్థ్యంపై కూడా ప్రభావం పడుతున్నట్టు వెల్లడించారు.
హీరో రాజ్ తరుణ్ నిందితుడే, ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు, పదేళ్ల పాటు సహజీవనం చేశారని కామెంట్
Study Explains How Traffic Noise, Pollution Are Linked To Infertility https://t.co/qpY1pdU19K pic.twitter.com/gxD6soJMoI
— NDTV News feed (@ndtvfeed) September 7, 2024
రక్తపోటు కూడా..
ట్రాఫిక్ రద్దీ సమయాల్లో వచ్చే పెద్ద శబ్దాల వల్ల మనుషుల్లో రక్తపోటు పెరుగుతున్నట్టు యూకే పరిశోధకులు తెలిపారు. వీటికి గల శాస్త్రీయ కారణాలపై లోతైన పరిశోధనలు చేస్తున్నట్టు తెలిపారు.
అఫిషియల్..నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం, ప్రశాంత వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ, ఫస్ట్ లుక్ రిలీజ్