Kano Jigoro Google Doodle: జిగోరో కానో 161వ జన్మదినం, ఫాదర్ ఆఫ్ జూడో గా ప్రసిద్ధిపొందిన ప్రముఖ విద్యావేత్త, జూడోని ప్రపంచానికి పరిచయం చేసి యుద్ధ కళ నిపుణుడు

జిగోరో కానో 161వ జన్మదినం సందర్భంగా గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ లో డూడుల్ తో నివాళి అర్పించింది.లాస్ ఏంజెల్స్, CA-ఆధారిత కళాకారిణి సింథియా యువాన్ చెంగ్ ఈ డూడుల్ ను చిత్రీకరించింది.

Happy birthday Kanō Jigorō Photo-Google)

ప్రముఖ విద్యావేత్త జిగోరో కానో జన్మదినం నేడు. జిగోరో కానో 161వ జన్మదినం సందర్భంగా గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ లో డూడుల్ తో నివాళి అర్పించింది.లాస్ ఏంజెల్స్, CA-ఆధారిత కళాకారిణి సింథియా యువాన్ చెంగ్ ఈ డూడుల్ ను చిత్రీకరించింది. ఈయనను ఫాదర్ ఆఫ్ జూడో గా పిలుస్తారు. జూడో కళను ప్రపంచానికి అందించిన గొప్ప విద్యావేత్తగా జిగోరో ప్రసిద్ధిపొందారు. క్రీడల్లో కూడా న్యాయం, మర్యాద, భద్రత, వినయం వంటి సూత్రాలు ఉండాలనే ఉద్దేశంలో ఈ క్రీడను ఆయన వెలుగులోకి తీసుకువచ్చాడు.

1860లో మికేజ్‌లో (ప్రస్తుతం కోబ్‌లో భాగం) జన్మించిన కానో తన 11వ ఏట తన తండ్రితో కలిసి టోక్యోకు వెళ్లాడు. పాఠశాలలో అతను చైల్డ్ ప్రాడిజీగా పేరుపొందినప్పటికీ, అతను తరచూ కష్టాలను ఎదుర్కొన్నాడు.బలం పెంచుకోవడం కోసం యుద్ద కళను అధ్యయనం చేశాడు. 1909లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)లో మొదటి ఆసియా సభ్యుడు అయ్యాడు. 1960లో, IOC జూడోను అధికారిక ఒలింపిక్ క్రీడగా ఆమోదించింది.1893లో మహిళలను క్రీడలోకి ఆహ్వానించారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..