Karnataka Horror: మరొక వ్యక్తితో భార్య అక్రమ సంబంధం.. కోపంతో అతడి గొంతు కోసేసి రక్తం తాగేసిన భర్త.. కర్ణాటకలో షాకింగ్ ఘటన
ఓ వ్యక్తి పట్టపగలు నడివీధిలో తన స్నేహితుడి గొంతు కోసి రక్తం తాగాడు. ఈ ఘటన జిల్లాలోని చింతామణి తాలూకా సిద్దేపల్లి సమీపంలో చోటు చేసుకుంది.
Bengaluru, June 26: కర్ణాటకలో (Karnataka) షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి పట్టపగలు నడివీధిలో తన స్నేహితుడి గొంతు కోసి రక్తం (Blood) తాగాడు. ఈ ఘటన జిల్లాలోని చింతామణి తాలూకా సిద్దేపల్లి సమీపంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయ్ (Vijay) అనే వ్యక్తి తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తన స్నేహితుడు మారేశ్ (Maresh) ఆమెతో సన్నిహితంగా ఉన్నాడని అనుమానిస్తున్నాడు. ఈ విషయమై చర్చించేందుకు రావాలంటూ మారేశ్‌ను పిలిచాడు. ఇద్దరూ మాట్లాడుకుంటుండగా వారి వాగ్వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలో కోపంతో రెచ్చిపోయిన విజయ్ పదునైన ఆయుధంతో మారేశ్ గొంతు కోసేశాడు.
మెడ నుంచి పెల్లుబికి వస్తున్న రక్తాన్ని..
అంతటితో ఆగకుండా ప్రతీ ఒక్కరినీ షాకింగ్ కి గురయ్యేలా ప్రవర్తించాడు. కిందపడి ఉన్న మారేశ్‌ను ఏదో ప్రశ్నిస్తూ, అతడ మెడ నుంచి పెల్లుబికి వస్తున్న రక్తాన్ని విజయ్ కిందకు వంగి తాగే ప్రయత్నం చేశాడు. ఈ షాకింగ్ దృశ్యాల్ని దారినపోయే వారు కెమెరాలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఉదంతం వైరల్‌గా మారింది. అయితే, తీవ్రంగా గాయపడిన మారేష్‌ను కొందరు స్థానికులు గుర్తించి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు విజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.