Woman Delivers Baby on KRSTC Bus: మానవత్వానికి మచ్చుతునక ఈ ఘటన.. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి బస్సులోనే కేరళ వైద్యుల ప్రసవం.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వైరల్ వీడియో ఇదిగో!!
మలప్పురానికి చెందిన ఓ 37 ఏళ్ల నిండు గర్భిణి కేఎస్ ఆర్టీసీ బస్సులో త్రిస్సూర్ నుంచి కోజీకోడ్ లోని తొట్టిపాలేనికి బయలుదేరింది.
Newdelhi, May 31: కేరళలో (Kerala) మానవత్వం పరిమళించే ఘటన ఇది. మలప్పురానికి చెందిన ఓ 37 ఏళ్ల నిండు గర్భిణి (Pregnant Women) కేఎస్ ఆర్టీసీ బస్సులో (KSRTC Bus) త్రిస్సూర్ నుంచి కోజీకోడ్ లోని తొట్టిపాలేనికి బయలుదేరింది. ఈ క్రమంలో ఆమెకు ఒక్కసారిగా పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని బస్సులోని ప్రయాణికులు డ్రైవర్ కు తెలియజేయడంతో అతను సమయస్ఫూర్తితో ఆలోచించి బస్సు రూటు మార్చాడు. సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఎమర్జెన్సీ డెలివరీ గురించి ఫోన్లో తెలియజేసి బస్సును నేరుగా అక్కడికే పోనిచ్చాడు.
స్ట్రెచర్ తో సిద్ధంగా ఉన్నప్పటికీ..
అప్పటికే అక్కడ స్ట్రెచర్ తో సిద్ధంగా సిబ్బంది ఆమెను ఆసుపత్రి లోపలకు తీసుకెళ్లాలనుకున్నారు. కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో వైద్యులు, నర్సులు హుటాహుటిన బస్సులోకే చేరుకొని ప్రసవం చేసి తల్లీబిడ్డను కాపాడారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు బస్సు డ్రైవర్, ఆసుపత్రి వైద్య బృందాన్ని మెచ్చుకుంటున్నారు.