Maharashtra: బుల్లెట్ వేగంతో రైలు..పట్టాలపై పిల్లోడు, క్షణం ఆలస్యం అయి ఉంటే చిన్నారి ప్రాణాలో గాలిలో కలిసేవి, ప్రాణాలను పణంగా పెట్టి చిన్నారిని, తన ప్రాణాలను కాపాడుకున్న రైల్వే ఉద్యోగి మయూర్ షెల్కే

ఇంతలో రైలు జెండా ఊపే గార్డు ఆఘమేఘాల మీద పట్టాల మీద పరిగెత్తుతూ ఆ పిల్లవాడిని కాపాడాడు. అదే సమయంలో తన చాలా సమయస్ఫూర్తితో తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

pointsman saves child life (Photo-Video grab)

Mumbai, April 19: ప్రమాదం ఏ వైపు నుంచి ముంచుకొసస్తుందో ఎవరూ చెప్పలేం.. సరిగ్గా అలాంటి ఘటనే ముంబైలో జరిగింది. క్షణం ఆలస్యం అయి ఉంటే పిల్లవాడి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఇంతలో రైలు జెండా ఊపే గార్డు ఆఘమేఘాల మీద పట్టాల మీద పరిగెత్తుతూ ఆ పిల్లవాడిని కాపాడాడు. అదే సమయంలో తన చాలా సమయస్ఫూర్తితో తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంఘటన వివరాల్లోకి వెళ్లితే ముంబై వాంఘాని రైల్వే స్టేషన్ 2 వ ప్లాట్‌ఫాం వద్ద నడుచుకుంటూ వెడుతుండగా బ్యాలెన్స్ కోల్పోయిన ఓ చిన్నారి అకస్మాత్తుగా రైల్వే పట్టాలపై పడిపోయింది. మరోవైపు అటునుంచి రైలు వేగంగా దూసుకొస్తోంది. దీంతో చిన్నారితో పాటు ఉన్న వ్యక్తి ఏం చేయాలో అర్థం కాక పెద్దగా కేకలు వేస్తున్నారు. పట్టాలపై పడిపోయిన చిన్నారిని గమనించిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్ఖే (mayur-shelkhe) వేగంగా కదలిలారు.

 Piyush Goyal  Tweet

రైలుకు ఎదురెళ్లి మరీ చిన్నారిని పట్టాల మీది నుంచి తప్పించి (mayur-shelkhe saves life of a child), అంతే వేగంగా తను కూడా తప్పుకున్నారు. ఇదంతా కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగింది. దీంతో క్షణాల్లో ప్రాణాపాయం తప్పింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డుయ్యాయి. ఈ వీడియోను దక్షిణ మధ్య రైల్వే షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సకాలంలో స్పందించిన రైల్వే ఉద్యోగి పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అటు రైల్వే మాన్ మయూర్ షెల్కే సాహసంపై కేంద్ర రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ సంతోషం వ్యక్తం చేశారు. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ చిన్నారిని ప్రాణాలను కాపాడటం గర్వంగా ఉందంటూ ట్వీట్‌ చేశారు.