Madhya Pradesh Shocker: నన్ను పెళ్లి చేసుకో అన్నందుకు నడిరోడ్డుపై యువతిని చావబాదిన ప్రియుడు.. అయినప్పటికీ, ఫిర్యాదు వద్దన్న బాధితురాలు.. అయితే, అధికారులు ఏం చేశారంటే?? వీడియోతో..

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Credits: Video Grab

Rewa, Dec 26: పెళ్లి చేసుకోమని అడిగిన ప్రియురాలిని నడిరోడ్డుపైనే చావబాదాడో ప్రియుడు. మధ్యప్రదేశ్‌లోని (Madhyapradesh) రేవా జిల్లాలో (Rewa District) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు (Video), ఫొటోలు (Photoes) సోషల్ మీడియాలో (Social Media) వైరల్ (Viral) అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలోని యువకుడిని మౌగంజ్ ప్రాంతంలోని ధేరా గ్రామానికి చెందిన 24 ఏళ్ల పంకజ్ త్రిపాఠిగా గుర్తించారు. 19 ఏళ్ల అమ్మాయితో అతడు ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో నడిరోడ్డుపైనే ఆమెను కిందపడేసి దాడిచేసి చితకబాదాడు. గత బుధవారం ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.

బౌండరీ కొట్టి జట్టును గెలిపించిన అశ్విన్.. డ్రెస్సింగ్‌ రూములో రియాక్షన్ ఇలా.. వీడియో ఇదిగో!

వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు తాజాగా నిందితుడు పంకజ్‌ను అరెస్ట్ చేశారు. అయితే, అతడిపై ఫిర్యాదు చేసేందుకు బాధిత యువతి నిరాకరించడంతో ఆ తర్వాత నిందితుడిని పోలీసులు వదిలిపెట్టారు. అమ్మాయిని హింసించిన నిందితుడికి ఇంటిని అధికారులు కూల్చివేసినట్టు సమాచారం. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేశారు. నిందితుడి ఇల్లు అక్రమ నిర్మాణమని, అందుకే కూల్చేశామని అధికారులు తెలిపారు.