Man Chops Off His Fingers: పని ఒత్తిడా? లేక పని చేయడం ఇష్టంలేకనో... మొత్తానికి పని నుంచి తప్పించుకోవదానికి కత్తితో చేతులు నరుక్కున్న వ్యక్తి.. గుజరాత్ లోని సూరత్ లో ఘటన (వీడియో)
వజ్రాల దుకాణంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న ఓ యువకుడు పని ఒత్తిడి మూలంగానో లేక ఆ ఉద్యోగం చేయడం నచ్చకనో ఏదైతేనేమీ తన చేతి నాలుగు వేళ్లను నరుక్కున్నాడు.
Surat, Dec 15: గుజరాత్ (Gujarat) లోని సూరత్ లో (Surat) విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వజ్రాల దుకాణంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న ఓ యువకుడు పని ఒత్తిడి మూలంగానో లేక ఆ ఉద్యోగం చేయడం నచ్చకనో ఏదైతేనేమీ తన చేతి నాలుగు వేళ్లను నరుక్కున్నాడు. బాధితుడిని మయూర్ తారాపర (32)గా గుర్తించారు. ఘటన అనంతరం రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడిపోయిన అతనిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
Here's Video:
మొదట కట్టుకథ
ఏం జరిగిందో పోలీసులు ఆరా తీసినప్పుడు మయూర్ మొదట ఓ కట్టు కథను అల్లినట్టు సమాచారం. తన చేతి వేళ్లను ఎవరో కత్తిరించారని అతను పోలీసులకు చెప్పాడు. అయితే ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజీలో చూడగా... తనకు తానే ఉద్దేశపూర్వకంగా చేతి వేళ్లను నరుక్కున్నట్లు పోలీసులు గుర్తించారు.
అల్లు అర్జున్‌కు సీఎం చంద్రబాబు ఫోన్, అరెస్ట్‌పై ఆరా, బన్నీ ఇంటికి క్యూ కడుతున్న హీరోలు