Ind vs Aus 4th Test: భార‌త్‌, ఆసీస్ మ‌ధ్య మ్యాచ్, 87 ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టిన ప్రేక్ష‌కులు, ఐదు రోజుల్లో రికార్డుస్థాయిలో 3,51,100 మంది హాజరు

ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి ఐదు రోజుల్లో రికార్డుస్థాయిలో 3,51,100 మందికి పైగా ప్రేక్ష‌కులు హాజ‌ర‌య్యారు. ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న ఓ టెస్టు మ్యాచ్‌కు ఇంత‌మంది రావడం ఇదే తొలిసారి

The Melbourne Cricket Ground (right) and fans at the MCG (left) (Photo credit: X @MCG)

మెల్‌బోర్న్‌లో భార‌త్‌, ఆసీస్ మ‌ధ్య జ‌రుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ లో 87 ఏళ్ల రికార్డు బద్దలయింది. ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి ఐదు రోజుల్లో రికార్డుస్థాయిలో 3,51,100 మందికి పైగా ప్రేక్ష‌కులు హాజ‌ర‌య్యారు. ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న ఓ టెస్టు మ్యాచ్‌కు ఇంత‌మంది రావడం ఇదే తొలిసారి.1937 జనవరిలో వేదికపై జరిగిన యాషెస్ టెస్టును వీక్షించేందుకు ఆరు రోజుల పాటు 3,50,534 మంది అభిమానులు రావడంతో ఈ రికార్డు గతంలో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) సొంతం చేసుకుంది.తాజాగా ఈ రికార్డు Ind vs Aus 4th Testతో బద్దలయింది.

సిరాజ్‌పై నితీశ్ రెడ్డి తండ్రి షాకింగ్ కామెంట్, సిరాజ్ బ్యాటింగ్‌లో టెన్షన్ పడ్డా..కానీ!

మొత్తంగా ఈ మ్యాచ్‌ టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యధిక మంది ప్రేక్ష‌కులు హాజరైన రెండవ మ్యాచ్‌గా నిలిచింది. 1999లో ఈడెన్ గార్డెన్స్‌లో జ‌రిగిన‌ చారిత్రాత్మకమైన భార‌త్‌, పాకిస్థాన్ మ్యాచ్ ఈ జాబితాలో టాప్‌లో ఉంది. ఈ మ్యాచ్ కు ఐదు రోజులలో నమ్మశక్యం కాని విధంగా ఏకంగా 4,65,000 అటెండెన్స్ న‌మోదైంది.