Wedding Called Off: విందులో చేపలు, మాంసం పెట్టరా? అయితే పెళ్లి క్యాన్సిల్.. వరుడు షాకింగ్ నిర్ణయం.. ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన
ఉత్తరప్రదేశ్ లోని డియోరియా జిల్లా ఆనంద్ నగర్ గ్రామంలో గురువారం ఈ షాకింగ్ ఘటన జరిగింది.
Newdelhi, July 14: పెళ్లి విందులో చేపలు (Fish), మటన్, చికెన్ (Chicken) పెట్టలేదన్న కారణంగా ఓ వరుడు ఏకంగా పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని డియోరియా జిల్లా ఆనంద్ నగర్ గ్రామంలో గురువారం ఈ షాకింగ్ ఘటన జరిగింది. పెళ్లి కోసం వధువు ఇంట్లో ఆమె కుటుంబ సభ్యులు చక్కటి ఏర్పాట్లు చేశారు. పనీర్, పులావ్, రకరకాల కూరలతో భారీ స్థాయిలో విందు ఏర్పాట్లు చేశారు. పెద్ద మొత్తంలో కట్నం కూడా ముట్టచెప్పారు. అయితే విందులో చేపలు, మటన్, చికన్ లేకపోవడం వరుడి కుటుంబానికి రుచించలేదు.
హైదరాబాద్ లోని అశోక్ నగర్ చౌరస్తాలో కొనసాగుతున్న నిరుద్యోగులు మెరుపు ధర్నా (వీడియో)
అలా మొదలై..
ఇదే విషయమై ఇరువర్గాల కుటుంబ సభ్యులు, బంధువులు గొడవకు దిగారు. నానా బూతులు తిడుతూ వధువు తరపు వారిని పెండ్లి కొడుకు బంధువులు కొట్టారు. కర్రలతో సైతం దాడి చేశారు. పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించి వరుడు అక్కడి నుంచి వెళ్లి పోయాడు. దీంతో పెళ్లి రద్దైంది. దీంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరకట్నం కూడా ముట్టజెప్పామని ఫిర్యాదు పేర్కొన్నారు. ఈ కొట్లాటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.