IPL Auction 2025 Live

Plane Veers Off Runway: రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం, ఏయిర్‌పోర్ట్ ఫెన్సింగ్‌ను ఢీకొట్టి ముక్కలైన ప్లేన్, మిరాకిల్‌ గా చిన్న చిన్నగాయాలతో బయటపడ్డ ప్రయాణికులు, వీడియో ఇదుగోండి!

ఫెన్సింగ్‌ను అది ఢీకొట్టి ముక్కలైంది. అయితే అదృష్టవశాత్తు విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. సొమాలియా రాజధాని మొగదీషులో ఈ మిరాకిల్‌ జరిగింది. జూలై 11న మధ్యాహ్నం 12:23 గంటలకు హల్లా ఎయిర్‌లైన్‌కు చెందిన ఈ 120 విమానం క్రాష్‌ ల్యాండ్‌కు ప్రయత్నించింది.

Plane Veers Off Runway (PIC Credit Twitter)

Somalia, July 14: ఒక విమానం రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లింది (Plane veers off runway). ఫెన్సింగ్‌ను అది ఢీకొట్టి ముక్కలైంది. అయితే అదృష్టవశాత్తు విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. సొమాలియా రాజధాని మొగదీషులో ఈ మిరాకిల్‌ జరిగింది. జూలై 11న మధ్యాహ్నం 12:23 గంటలకు హల్లా ఎయిర్‌లైన్‌కు చెందిన ఈ 120 విమానం క్రాష్‌ ల్యాండ్‌కు ప్రయత్నించింది. రాజధాని మొగదీషులోని అడెన్ అడ్డే అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌ వేపై దిగుతుండగా ఆ విమానం అదుపుతప్పింది. రన్‌ వేకు ఒక పక్కగా ఉన్న ఫెన్సింగ్‌ వైపు వేగంగా దూసుకెళ్లింది. ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన ఆ విమానం పలు ముక్కలైంది. దాని రెక్కలు విరిగిపోయాయి. టైర్లు ఊడిపోయాయి. అయినప్పటికీ ఆ విమానం సిబ్బందితోపాటు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు స్వల్పంగా గాయపడినట్లు సొమాలి సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి మొత్తం 34 మంది ఆ విమానంలో ఉన్నట్లు చెప్పారు.

కాగా, ఈ విమాన ప్రమాదంపై సొమాలి సివిల్ ఏవియేషన్ అథారిటీ (SCAA) దర్యాప్తునకు ఆదేశించింది. విమానం రన్‌ వే నుంచి పక్కకు ఎందుకు వెళ్లిందో అన్నదానికి సరైన కారణం తెలియలేదని పేర్కొంది. పైలట్‌ కూడా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని తెలిపింది. దర్యాప్తు తర్వాతే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పింది. మరోవైపు విమానం అదుపు తప్పి రన్‌ వే నుంచి పక్కకు దూసుకెళ్లి ఫెన్సింగ్‌ను ఢీకొని ముక్కలైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.