Raju Srivastava: ఇంకా విషమంగానే ఉన్న కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఆరోగ్యం.. శ్రీవాస్తవ సతీమణికి ప్రధాని మోదీ ఫోన్.. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ
శ్రీవాస్తవ సతీమణికి ప్రధాని మోదీ ఈరోజు ఫోన్ చేసి మాట్లాడారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
New Delhi, August 12: జిమ్ చేస్తూ బుధవారం గుండెపోటుకు గురైన హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ (Raju Srivastava) ఆరోగ్య పరిస్థితి (Health Condition) విషమంగా ఉన్నట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన మెదడు (Brain) కూడా దెబ్బతిందని తాజా పరీక్షల్లో తేలినట్లు సన్నిహితుల నుంచి సమాచారం.
శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ (Modi) ఈరోజు ఆరా తీశారు. ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ చైర్ పర్సన్ అయిన శ్రీవాస్తవ సతీమణికి ఫోన్ చేసిన ప్రధాని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.