Shivamogga Subbanna: గుండెపోటుతో ప్రముఖ కన్నడ సింగర్‌ శివమొగ్గ సుబ్బన్న కన్నుమూత.. శాండల్‌వుడ్‌లో జాతీయ అవార్డు అందుకున్న తొలి గాయకుడిగా గుర్తింపు
Shivamogga subbanna (Image Credits: Twitter)

Bangalore, August 12: కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్‌, నేషనల్‌ అవార్డు విన్నర్‌ శివమొగ్గ సుబ్బన్న(83) (Shivamogga subbanna) గుండెపోటుతో (Heart Attack) హఠాన్మరణం చెందారు. కన్నడ గాయకుడైన ఆయన గురువారం రాత్రి బెంగళూరు (Bangalore)లోని ఓ దవాఖానలో గుండెపోటుతో కన్నుమూసినట్లు సన్నిహితులు తెలిపారు.

మరోసారి తన విశిష్టతను చాటుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. 10 కోట్లు ఇస్తామన్నా ఆ పని చేయలేదు. ఏంటా విషయం?

శాండల్‌వుడ్‌ (Sandalwood)లో జాతీయ అవార్డు అందుకున్న తొలి గాయకుడిగా సుబ్బన్న గుర్తింపు పొందారు. ‘కాదే కుద్రే ఒడి’ అనే పాటకు ఆయన అవార్డును అందుకున్నారు. కువెంపు రచించిన ‘బారిసు కన్నడ డిండిమావ’ పాట ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టింది.