IPL Auction 2025 Live

Crown Of Maa Kali Stolen: ప్రధాని మోదీ బహూకరించిన జెషోరేశ్వరి కాళీ మాత బంగారు కిరీటం మాయం.. బంగ్లాదేశ్ లో ఘటన.. వీడియో వైరల్

అయితే, బంగ్లాలోని సత్‌ ఖిరా నగరంలోని శ్యామ్‌ నగర్‌ లో ఉన్న ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయంలోని మాత బంగారు కిరీటం చోరీకి గురైంది.

Crown Of Maa Kali Stolen (Credits: X)

Newdelhi, Oct 11: దేశవ్యాప్తంగానే కాదు బంగ్లాదేశ్ (Bangladesh) లోనూ దేవీ నవరాత్రి ఉత్సవాలు సందడిగా జరుగుతున్నాయి. అయితే, బంగ్లాలోని సత్‌ ఖిరా నగరంలోని శ్యామ్‌ నగర్‌ లో ఉన్న ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయంలోని మాత బంగారు కిరీటం (Crown Of Maa Kali Stolen) చోరీకి గురైంది. ఈ చోరీ ఘటన ఆలయంలోని సీసీటీవీలో రికార్డైంది. అందులో ఓ యువకుడు బంగారు కిరీటం తీసుకెళ్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. ఈ కాళీ ఆలయ కిరీటంతో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక అనుబంధం ఉంది. 2021లో ప్రధాని మోదీ బంగ్లాలో పర్యటించినప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాదు ఆ దేశానికి ఈ బంగారు కిరీటాన్ని బహుమతిగా ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఈ కిరీటం దుర్గాపూజ ప్రత్యేక సందర్భంలో చోరీకి గురైంది.

ఏపీకి పొంచిఉన్న వాయుగుండం ముప్పు.. సోమవారం నుంచి భారీ వర్షాలకు అవకాశం.. వాతావరణ శాఖ హెచ్చరికలు

51 శక్తి పీఠాలలో జేశోరేశ్వరి ఆలయం ఒకటి

ప్రపంచంలోని 51 శక్తి పీఠాలలో జెశోరేశ్వరి ఆలయం ఒకటి. “జేషోరేశ్వరి” అనే పేరుకు “జెషోర్ దేవత” అని అర్ధం. ప్రధాని మోదీ మార్చి 27, 2021న బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా జెషోశ్వరీ ఆలయాన్ని సందర్శించారు. అదే రోజు, కాళీ ఆలయంలో ప్రధానమంత్రి దేవతకు బంగారు కిరీటంతో పాటు పూలమాల వేశారు.

ముగిసిన పారిశ్రామిక దిగ్గ‌జం అంత్య‌క్రియ‌లు, పార్సి సాంప్ర‌దాయం ప్రకార‌మే కానీ..నూత‌న ప‌ద్ద‌తిలో అంత్య‌క్రియ‌ల నిర్వ‌హ‌ణ‌