Prank Goes Wrong: మహిళతో ప్రాంక్ చేయబోయిన వ్యక్తి, ప్రమాదవశాత్తు గోడమీద నుంచి పడి చనిపోయిన మహిళ
అయితే అదుపుతప్పిన నాగినా దేవి మూడో అంతస్తు నుంచి కింద పడి మరణించింది. ఆమెతోపాటు పడబోయిన బంటీ అదృష్టవశాత్తు గోడను గట్టిగా పట్టుకున్నాడు. అక్కడున్న వారి సహాయంతో బతికిపోయాడు
Mumbai, July 17: ఒక వ్యక్తి సరదాగా ఫ్రాంక్ (Prank) చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అది బెడిసికొట్టంతో మూడో అంతస్తు నుంచి కింద పడి ఒక మహిళ మరణించింది. (Woman falls to death) సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. డోంబివాలిలోని గ్లోబ్ స్టేట్ బిల్డింగ్ కాంప్లెక్స్‌లోని క్లీనింగ్ సెక్షన్‌లో నాగినా దేవి అలియాస్ గుడియా దేవి పని చేస్తున్నది. మంగళవారం మధ్యాహ్నం 2.40 గంటలప్పుడు విరామ సమయంలో మూడో అంతస్తులోని మెట్ల వద్ద ఉన్న గోడపై ఆమె కూర్చొంది. సహోద్యోగులతో కలిసి జోకులు వేస్తూ నవ్వుతూ మాట్లాడుతోంది. కాగా, బంటీ అనే వ్యక్తి నాగినా దేవి చెయ్యి పట్టుకున్నాడు. ఫ్రాంక్ చేసేందుకు సరదాగా ఆమెను హత్తుకున్నాడు. అయితే అదుపుతప్పిన నాగినా దేవి మూడో అంతస్తు నుంచి కింద పడి మరణించింది. ఆమెతోపాటు పడబోయిన బంటీ అదృష్టవశాత్తు గోడను గట్టిగా పట్టుకున్నాడు. అక్కడున్న వారి సహాయంతో బతికిపోయాడు.
మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నాగినా దేవి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అక్కడున్న సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.