Elephants Might Call Each Other By Name: మనుషులే కాదు.. ఏనుగులూ పేర్లతో పిలుచుకుంటాయ్.. తాజా అధ్యయనం ఏం చెప్పిందంటే??
ఏనుగులు మాత్రం తమ గుంపులోని మిగతా ఏనుగులను మనుషుల మాదిరిగానే పేర్లతో పిలుచుకుంటాయని, అవి ఒకదానికికొకటి పేర్లు పెట్టుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Newdelhi, June 12: మనుషుల మాదిరే జంతువులు (Animals) కూడా మాట్లాడుకుంటాయా? మిగతా వాటి గురించి ఏమోగానీ.. ఏనుగులు (Elephants) మాత్రం తమ గుంపులోని మిగతా ఏనుగులను మనుషుల మాదిరిగానే పేర్లతో పిలుచుకుంటాయని, అవి ఒకదానికికొకటి పేర్లు పెట్టుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కెన్యా అడవుల్లో ఏనుగుల స్వర పేటిక శబ్దాలను రికార్డ్ చేసిన సైంటిస్టులు, తిరిగి వాటి ఆడియోను ప్లే చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. తమను ఉద్దేశించి వచ్చిన ప్రతి పిలుపునకు సదరు ఏనుగులు ప్రతిస్పందించటం సైంటిస్టులకు కనిపించింది.
దాదాపు 100 ఏనుగులు ఇలా
కెన్యాలో దాదాపు 100 ఏనుగులు ఇలా పేర్లతో పిలుస్తున్నాయన్న సంగతి పరిశోధకుల అధ్యయనంలో తేలింది.