Hyderabad, June 12: నైరుతి రుతుపవనాల ఆగమనంతో తెలంగాణవ్యాప్తంగా (Telangana) మంచి వానలు పడుతున్నాయి. నేడు తెలంగాణవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురియనున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా 16 జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణ సహా హైదరాబాద్ లో మరో మూడు రోజులు వానలు పడనున్నట్టు వెల్లడించింది. కాగా.. మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారంలో అత్యధికంగా 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావ్ పేటలో 6.5, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదీగూడలో 6.5లో వర్షం కురిసింది. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో పిడుగులు పడి ఇద్దరు రైతులు మృతి చెందారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. Read More:https://t.co/8bVQ8IwghE#Weatherupdate #Telangana #RTV
— RTV (@RTVnewsnetwork) June 12, 2024
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి
నేడు ఈ జిల్లాల్లో తేలికపాటి-మోస్తరు వర్షాలు
ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి
గురువారం ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి