Viral: బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవతోందా..ఆవు కడుపులో రెండు తలల పంది..చూసేందుకు జనం క్యూ..ఎక్కడంటే...

పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇఫ్పుడు అలాంటి కాలచక్రం సూచనలు ప్రపంచంలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి.

Mascow, Oct 27:  బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వింత జంతువులు పుట్టడం ద్వారా కలియుగం అంతం అవుతుందని రాశారు. పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇఫ్పుడు అలాంటి కాలచక్రం సూచనలు ప్రపంచంలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అప్పుడే పుట్టిన ఓ దూడ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దూడకు రెండు తలలు ఉన్నాయి. అవి కూడా పందుల వలె ఉన్నాయి.

ఈ వింత దూడ ఫోటో వైరల్ కావడంతో చాలా మంది చూడటానినకి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రష్యాలోని ఖకాసియాలోని మట్కెచిక్ గ్రామంలో ఈ దూడ పుట్టింది. వైరల్ ఫోటోలో ఈ గులాబీ రంగులోని దూడకు రెండు ముఖాలు ఉన్నాయి. వాటి నోటి నుంచి రెండు నాలుకలు బయటికి వచ్చాయి. ముందరి కాళ్లకు ఇరువైపులా రెండు నాలుకలు వేలాడుతూ కనిపిస్తున్నాయి. దూడ పుట్టిన వెంటనే చనిపోగా, కొద్దిరోజుల్లో తల్లి కూడా చనిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

ఖాకాసియా రిపబ్లిక్ , వ్యవసాయం , ఆహార మంత్రిత్వ శాఖ , వెటర్నరీ డిపార్ట్‌మెంట్ అక్టోబర్ 25 న ఒక ప్రకటనలో మాట్లాడుతూ, బేస్కీ జిల్లా, మట్కెచిక్ గ్రామంలోని ఒక ప్రైవేట్ ఫామ్‌స్టెడ్‌లో వాస్తవానికి అలాంటి కేసు జరిగింది. యజమాని తెలిపిన వివరాల ప్రకారం, దూడ చనిపోయి పుట్టిందని, ఇది ఆ ఆవుకు మొదటి సంతానం అని పేర్కొన్నారు.

కొన్ని జంతువులు జన్యుపరమైన అసాధారణతలతో (మ్యుటేషన్లు) పుట్టడానికి ప్రధాన కారణం జీనోమ్‌లో మార్పులేనని పశువైద్య విభాగం వైద్యులు చెబుతున్నారు. జంతువులలో ఉత్పరివర్తనాల కారణాలు వాటి బాహ్య , అంతర్గత వాతావరణం కారణంగా ఉంటాయి. గత సంవత్సరం, చైనాలో రెండు తలల దూడ జన్మించింది, దాని ఫోటో వైరల్ అయ్యింది.