Gold Coins: కాలం కలిసిరావడమంటే ఇదేనేమో.. రాత్రికి రాత్రి వాళ్ళు కోటీశ్వరులయ్యారు!
ఇంటి మరమ్మత్తుల కోసం తవ్వకాలు చేపట్టిన ఆ దంపతులకు ఊహించని గిఫ్ట్.. ఏంటది?
London, September 3: కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు అంటే ఇదేనేమో.. పాతబడిన ఇళ్లకు మెరుగులు దిద్దే క్రమంలో ఓ జంటకు ఊహించని రీతితో ఏకంగా రూ.2కోట్లకు పైగా విలువ చేసే బంగారు నాణేలు లభించాయి. అవి కూడా రోజూ వంటచేసుకొనే కిచెన్ లోని బండల కింద దొరికే. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన యూకేలోని నార్త్ యార్క్ షైర్‌లోని ఎల్లెర్బీ గ్రామంలో చోటు చేసుకున్నది. దొరికిన నాణేలపై 1610-1727 నాటి ముద్రలు ఉన్నాయి. ఇవి ఒకటో జేమ్స్, ఒకటో చార్లెస్ రాజుల కాలం నాటివని అంచనా వేశారు. దాదాపు 264 బంగారు నాణేలు వారికి దొరికాయి. ప్రస్తుతం వాటి విలువ దాదాపు.. ఇప్పటి మార్కెట్ ప్రకారం రూ.2.3 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.