Union Budget 2024: ధరలు తగ్గేవి, పెరిగేవి ఇవే, యూనియన్ బడ్జెట్ 2024 ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి, చౌక, కాస్ట్లీ వస్తువుల పూర్తి జాబితాను ఓ సారి తెలుసుకోండి
మొబైల్ ఫోన్ ధరలు, బంగారం, వెండి , రాగి ధరలు తగ్గింపునకు దారితీసే చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించారు.
What's cheaper and what's costlier? ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్మలమ్మ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇక కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇవాళ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కొత్త పన్ను విధానం ఎంచుకున్న ఉద్యోగులకు అలర్ట్, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000 కుపెంచుతున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటన
మహిళలు, బాలికల కోసం ప్రత్యేక పథకాలను, ఉద్యోగుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి ప్రస్తుత పన్నుల విధానం, పన్ను మినహాయింపులను కూడా ప్రతిపాదించారు. మొబైల్ ఫోన్ ధరలు, బంగారం, వెండి , రాగి ధరలు తగ్గింపునకు దారితీసే చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గించారు. క్యాన్సర్ రోగులకు బడ్జెట్‌లో ఊరట, మూడు రకాల మందులపై సుంకాన్ని ఎత్తివేసిన మోదీ సర్కారు
బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గించారు. మూడు కేన్సర్ చికిత్స మందులు ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు నిచ్చారు. దీంతో కేన్సర్ బాధితులకు భారీ ఊరట లభించనుంది. బంగారం, వెండిపై సుంకాలు 6 శాతం తగ్గింపు రిటైల్ డిమాండ్‌ను గణనీయంగా పెంచు తుందన్నారు. ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీలను 6.5 శాతం తగ్గించాలని, రొయ్యలు, చేపల మేతతో కూడిన సీఫుడ్‌పై 5 శాతం తగ్గింపును ఆర్థికమంత్రి ప్రతిపాదించారు.
ధరలు పెరిగేవి, తగ్గేవి జాబితాను ఒకసారి పరిశీలిస్తే..
చౌకగా మారిన వస్తువులు
మొబైల్ పరికరాలు: మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 15 శాతానికి తగ్గించారు.
క్యాన్సర్ మందులు: మూడు అదనపు క్యాన్సర్ చికిత్స ఔషధాలకు కస్టమ్స్ సుంకం నుండి మినహాయింపు ఇవ్వబడింది.
బంగారం మరియు వెండి: బంగారం మరియు వెండిపై కస్టమ్స్ సుంకాలు 6 శాతానికి తగ్గించబడ్డాయి.
ప్లాటినం: ప్లాటినంపై కస్టమ్స్ సుంకాలు 6.5 శాతానికి తగ్గించబడ్డాయి.
సీఫుడ్: కొన్ని బ్రూడ్ స్టాక్స్, రొయ్యలు మరియు చేపల మేతపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం 5 శాతానికి తగ్గించబడింది.
సౌరశక్తి భాగాలు: సౌరశక్తికి సంబంధించిన భాగాలపై కస్టమ్స్‌ను పొడిగించకూడదని ప్రభుత్వం ప్రతిపాదించింది.
పాదరక్షలు: తోలు మరియు పాదరక్షల తయారీపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
కీలకమైన ఖనిజాలు: ఇరవై ఐదు కీలకమైన ఖనిజాలు కస్టమ్స్ సుంకాల నుండి మినహాయించబడతాయి మరియు వాటిలో రెండింటిపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం తగ్గించబడుతుంది.
ఫెర్రోనికెల్ మరియు బ్లిస్టర్ కాపర్: ఫెర్రోనికెల్ మరియు బ్లిస్టర్ కాపర్‌పై ప్రాథమిక కస్టమ్స్ సుంకం తొలగించబడింది.
ఖరీదైనవిగా మారిన వస్తువులు
టెలికాం పరికరాలు: నిర్దేశిత టెలికాం పరికరాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచారు.
అమ్మోనియం నైట్రేట్: అమ్మోనియం నైట్రేట్‌పై కస్టమ్స్ సుంకాన్ని 10 శాతానికి పెంచారు.
నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్: నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ పై కస్టమ్స్ సుంకాన్ని 10 శాతానికి పెంచారు.
ప్లాటినం వస్తువులు
బంగారు కడ్డీలు
కృత్రిమ ఆభరణాలు
సిగరెట్
వంటగది చిమ్నీలు
కాంపౌండ్ రబ్బరు
కాపర్ స్క్రాప్