IPL Auction 2025 Live

Voting BJP for 8 times: బీజేపీకి 8 సార్లు ఓటేసిన యూపీ యువకుడు.. వీడియో వైరల్.. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. పోలింగ్ బూత్ అధికారులందరినీ సస్పెండ్ చేస్తూ ఈసీ ఆదేశాలు (వీడియో ఇదిగో)

నిబంధనలను అతిక్రమిస్తూ బీజేపీకి ఏకంగా 8 మార్లు ఓటేశాడు ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకుడు రంజన్ సింగ్‌.

Voting BJP for 8 times (Credits: X)

Newdelhi, May 20: ప్రజాస్వామ్యాన్ని (Democracy) అపహాస్యం చేస్తూ ఎన్నికల ప్రక్రియను వెక్కిరించే చర్య ఇది. నిబంధనలను అతిక్రమిస్తూ బీజేపీకి (BJP) ఏకంగా 8 మార్లు ఓటేశాడు ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకుడు రంజన్ సింగ్‌. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ వీడియో వైరల్ (Video Viral) కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు. వీడియోలో రంజన్ సింగ్.. బీజేపీ అభ్యర్థి ముఖేశ్ రాజ్‌పుత్‌కి ఎనిమిది సార్లు ఓటేయడం కనిపిస్తోంది. యూపీలోని ఫరూఖాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాజ్‌ పుత్ బరిలో నిలిచారు.

ప్రారంభమైన 5వ దశ పోలింగ్.. 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో కొనసాగుతున్న ఓటింగ్.. బరిలో నిలిచిన 695 మంది అభ్యర్థులు, ఓటు హక్కు వినియోగించుకోనున్న 8.95 కోట్ల మంది ఓటర్లు.. రేసులో రాహుల్ గాంధీ, రాజ్‌ నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు

ఈసీ కన్నెర్ర

ఈ ఘటనపై ఈసీ కూడా సీరియస్ అయ్యింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఘటన జరిగిన పోలింగ్ బూత్ లో విధులు నిర్వర్తిస్తున్న వారందరినీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ క్రీడాకారిణి జీవాంజి దీప్తి కి గోల్డ్ మెడల్.. మహిళల టీ20 400 మీటర్ల హీట్స్ ను 55.06 సెకన్లలో ముగించి ప్రపంచ రికార్డు