UP Horror: బాలుడిపై లైంగిక దాడికి వ్యక్తి యత్నం.. విఫలం కావడంతో హత్య.. యూపీలో దారుణం
ఆ చర్య విఫలం కావడంతో ఆ బాలుడ్ని హత్య చేశాడు. మృతదేహాన్ని చెరకు తోటలో దాచాడు. చివరకు ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Newdelhi, Nov 11: బాలుడిపై (Boy) లైంగిక దాడికి ఒక వ్యక్తి ప్రయత్నించాడు. ఆ చర్య విఫలం కావడంతో ఆ బాలుడ్ని హత్య (Murder) చేశాడు. (Man Murders Boy After Rape Attempt Fail) మృతదేహాన్ని చెరకు తోటలో దాచాడు. చివరకు ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బిలాస్ పూర్ కు చెందిన వ్యక్తి తన 8 ఏళ్ల కుమారుడు కిడ్నాప్ అయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పొరుగింట్లో అద్దెకు ఉండే 21 ఏళ్ల శివంపై అనుమానం వ్యక్తం చేశాడు. అతడు తన కుమారుడ్ని మభ్యపెట్టి బయటకు తీసుకెళ్లాడని ఆరోపించాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దీనిని గుర్తించినట్లు చెప్పాడు.
చెరకు తోటలో దాచి
సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు చివరకు చెరకు తోటలో దాచిన బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే రక్తం మరకలు ఉన్న బాలుడి దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆ బాలుడిపై లైంగిక దాడికి ప్రయత్నించిన నిందితుడు అది విఫలం కావడంతో హత్య చేసినట్లు తెలిపారు.