UP Shocker: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం...18 మంది దుర్మరణం... పాల ట్యాంకర్‌ను ఢీకొట్టిన డబుల్‌ డెక్కర్‌ బస్సు

బుధవారం వేకువజామున ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై బీహార్ నుండి ఢిల్లీ వైపు వెళ్తున్న స్లీపర్ బస్సును మిల్క్ ట్యాంకర్‌ను ఢీకొంది.

IMAGE: PTI

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. బుధవారం వేకువజామున ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై బీహార్ నుండి ఢిల్లీ వైపు వెళ్తున్న స్లీపర్ బస్సును మిల్క్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ దుర్ఘటనలో సుమారు 18 మంది మృతి చెందగా, 19 మందికి గాయాలైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా బంగార్‌ మౌ ప్రాంతంలోని జోజికోట్ గ్రామ సమీపంలోని బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 05:15 గంటలకు బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులందరినీ బయటకు తీసి చికిత్స నిమిత్తం సిహెచ్‌సి తరలించి మృతదేహాలను స్వాధీనం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif