Uttar Pradesh: వీడియో ఇదిగో, దేవాలయంలో ఏసీ నుంచి కారుతున్న నీటిని తాగేందుకు ఎగబడుతున్న భక్తులు, కోరి కోరి రోగాలు తెచ్చుకోవద్దంటున్న వైద్యులు
శ్రీకృష్ణుడి దర్శనం అనంతరం గుడికి వెనుక భాగంలో ఏనుగు శిల్పం నుంచి కారుతున్న నీటిని టీ కప్పుల్లో నింపుకొని భక్తులు తాగుతున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని వ్రిందావన్ నగరంలో ప్రముఖ ప్రసిద్ధ ‘బాంకే బిహారీ’ అనే శ్రీకృష్ణుని దేవాలయం ఉంది. శ్రీకృష్ణుడి దర్శనం అనంతరం గుడికి వెనుక భాగంలో ఏనుగు శిల్పం నుంచి కారుతున్న నీటిని టీ కప్పుల్లో నింపుకొని భక్తులు తాగుతున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఈ వీడియోలో ఏనుగు శిల్పం నుంచి ఏసీ విడుదల చేసే నీరు కారుతుందని చెబుతున్న మాటలు వినబడటం మనం చూడొచ్చు.కొంతమంది భక్తులు నీటిని సేకరించడానికి కప్పులను ఉపయోగిస్తుండగా.. మరికొందరు చేతిలో తీర్ధం తీసుకున్నట్లుగా ఏసీ నుంచి కారే నీటిని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు.
నేడు కార్తీక మాసం మొదటి సోమవారం.. శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు.. భక్తుల విశేష పూజలు.. (వీడియో)
ఆలయ నిర్మాణ సమయంలో ఏసీలను ఏర్పాటు చేశారు. ఆ ఏసీల నుంచి కారే నీటిని బయట విడుదలయ్యేలా ఏనుగు ఆకారంలో ఉండే గొట్టాలను అమర్చారు. ఇప్పుడు ఏనుగు ఆకారంలో ఉండే గొట్టాల ద్వారా విడుదలవుతున్న నీటినే భక్తులు తాగుతున్నారు. వీడియోలపై డాక్టర్లు స్పందిస్తూ..దేవాలయంలో అమర్చిన ఏసీల నుంచి వచ్చే నీరని తాగొద్దని కోరుతున్నారు. ఏసీ నుంచి వచ్చే నీటిని తాగడం వల్ల ప్రాణాంతకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకుతుందని హెచ్చరిస్తున్నారు.
Devotees drink AC water
అయితే భక్తులు మాత్రం ఏనుగు శిల్పం నోటి నుండి కారుతున్న 'చరణ్ అమృతం’ (దేవుడు తమని ఆశీర్వదిస్తున్నారనే సూచికగా) భావిస్తున్నారు. శ్రీకృష్ణుడి పాదాల నుండి వస్తున్న పవిత్ర జలం అంటూ భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.