Minister Car Gets Stuck In Pothole: రోడ్డుపై గుంతలో చిక్కుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కారు.. వీడియో వైరల్‌

అయితే, ఓ కేంద్ర మంత్రికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

Minister Car Gets Stuck In Pothole (Credits: X)

Newdelhi, Sep 24: వర్షాకాలంలో రోడ్లపై ఏర్పడ్డ గుంతల్లో (Potholes) సామాన్యుల వాహనాలు చిక్కుకోవడం చూసే ఉంటాం. అయితే, ఓ కేంద్ర మంత్రికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (Union Minister Shivraj Singh Chouhan) ప్రయాణించిన కారు రోడ్డుపై ఉన్న నీటి గుంతలో చిక్కుకున్నది. కొంత సేపటి వరకు ఆ వాహనం ముందుకు కదలలేదు. సెక్యూరిటీ సిబ్బంది గొడుగులు పట్టుకోగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ కారు నుంచి కిందకు దిగారు.

శ్రీవారిని దర్శించుకోవాలా? అయితే, భక్తులకు అలర్ట్.. నేడు ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల.. పూర్తి వివరాలివే

Here's Video:

స్థానికుల సాయంతో..

ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది స్థానికుల సహాయంతో ఆ కారును గుంత నుంచి బయటకు తోశారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ వాహనంలో ప్రయాణం కొనసాగించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మంత్రికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది కదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా బెజవాడ దుర్గమ్మ గుడి మెట్లు శుద్ధి చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌



సంబంధిత వార్తలు