Violence Erupts In Manipur: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. భద్రతా సిబ్బంది - కుకీల మధ్య ఘర్షణ, ఒకరు మృతి, ఏడుగురు అరెస్ట్

మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగింది(Violence Erupts In Manipur). అమిత్ షా ఆదేశాలను నిరసిస్తూ అల్లర్లు జరుగగా భద్రతా సిబ్బంది కుకీల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి, 40 మందికి గాయాలు అయ్యాయి.

Violence Erupts in Manipur, Clashes Between Security Forces and Kukis, one dead(X)

Delhi, March 09:  మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగింది(Violence Erupts In Manipur). అమిత్ షా ఆదేశాలను నిరసిస్తూ అల్లర్లు జరుగగా భద్రతా సిబ్బంది కుకీల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి, 40 మందికి గాయాలు అయ్యాయి.

ప్రైవేటు వాహనాలకు నిప్పుపెట్టారు నిరసనకారులు. ఇక అలాగే ఇంఫాల్-దిమాపూర్ జాతీయ రహదారిపై కుకీలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మణిపూర్ లో వాహనాలు స్వేచ్ఛగా రాకపోకలకు సాగించేందుకు కేంద్ర హోం మంత్రి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

నా ముందే రైలు గేటు వేస్తారా? అనుకున్నడో ఏమో.. రైల్వే క్రాసింగ్‌ ను దాటేందుకు.. ఈ బైకర్‌ ఏం చేశాడో తెలుసా? (వైరల్ వీడియో) 

ఈ ఘటనలో అధికారులు ఏడుగురిని అరెస్ట్ చేయగా భారీ స్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మణిపూర్‌లో కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఘర్షణల పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్చి 8, 2025 నుండి నిర్బంధం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా వాహనాలు, ప్రజలు సంచరించేందుకు అనుమతి ఇచ్చారు.

దీంతో కంగ్పోక్పి జిల్లా గామ్‌గిఫై ప్రాంతంలో ఓ ప్రయాణికుల బస్సుపై కొందరు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో భద్రతా బలగాలు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, లాఠీచార్జ్‌ లాంటి చర్యలు చేపట్టాయి. ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు.

భద్రతా బలగాలు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లలో నిషేధిత మిలిటెంట్ గ్రూపులైన కంగ్లెపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (PWG), కంగ్లై యౌల్ కన్నా లూప్ (KYKL) సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులు ఇంఫాల్ వెస్ట్‌లోని లాంపెల్, టెంగ్నౌపాల్ జిల్లాలోని భారత్-మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగాయి.

Violence Erupts in Manipur, Clashes Between Security Forces and Kukis, one dead

రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అనేక ఆపరేషన్లలో భద్రతా బలగాలు 114 ఆయుధాలు, గ్రెనేడ్లు, IEDలు (Improvised Explosive Devices), భారీ స్థాయిలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ప్రజలను శాంతి, భద్రత పునరుద్ధరణలో భాగస్వాములుగా మారాలని, యువత భవిష్యత్తును రక్షించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement