Uttar Pradesh: ఫోటోగ్రాఫర్ లేడని పెళ్ళి క్యాన్సిల్ చేసిన వధువు, నా గురించి ఇప్పుడు ఆలోచించని వాడు జీవితాంతం నన్ను సంతోషంగా ఉంచుతాడా ప్రశ్న, కాన్సూర్‌ పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ

కడదాకా నిలిచి ఉంటామని ప్రమాం చేసుకునే పెళ్లిళ్లు మరి చిన్న కారణాలకే ఆగిపోవడం (UP bride cancels wedding) దేశంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కూడా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది

Representational Image (Photo Credits: unsplash.com)

ఈ మధ్య పెళ్లిళ్లు చిన్న చిన్న కారణాలతోనే ఆగిపోతున్నాయి. కడదాకా నిలిచి ఉంటామని ప్రమాం చేసుకునే పెళ్లిళ్లు మరి చిన్న కారణాలకే ఆగిపోవడం (UP bride cancels wedding) దేశంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కూడా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఇక్కడి ఒక గ్రామంలో నివశించే అమ్మాయికి.. పక్క ఊరికి చెందిన అబ్బాయితో పెళ్లి నిశ్చయం చేశారు.పెళ్లి కూతురి కుటుంబం ‘జైమాల్’ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసింది. అబ్బాయి వాళ్లు ‘బారత్’తో రాగానే అందరూ మండపానికి చేరుకున్నారు.

అందంగా అలంకరించిన మండపంలో ‘జైమాల్’ జరగాల్సి ఉండగా.. అబ్బాయి తరఫు వాళ్ల బృందంలో ఎలాంటి ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు లేకపోవడం (he fails to arrange photographer) చూసింది వధువు. అంతే ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. తను ఆ పెళ్లి చేసుకోనంటూ (Bride refuses to marry groom) మొండికేసింది. పక్క ఇంటికి వెళ్లి అక్కడే కూర్చుండిపోయింది. ఆమెను ఎంత మంది బతిమిలాడినా వినలేదు. ‘‘నాతో ఈ రోజు జరిగే పెళ్లి గురించే పెద్దగా పట్టించుకోని ఇలాంటి వాడు.. జీవితాంతం నన్ను సంతోషంగా ఉంచుతాడా?’’ అని ప్రశ్నించింది.

విమానంలోనే ఫైలట్ల సెక్స్ దుకాణం, ఫ్లైట్ నడపడం వదిలేసి శృంగారంలో మునిగితేలిన ఫైలట్లు, కాక్‌పీట్‌లో వారి కామవాంఛలు రికార్డ్, లీక్ వీడియో బయటకు రావడంతో అప్రమత్తమైన ఫ్లయింగ్‌ స్కూల్‌ వర్గాలు

ఈ గొడవ అటు తిరిగి ఇటు తిరిగి పోలీస్ స్టేషన్‌కు చేరింది. అక్కడి అధికారుల ప్రమేయంతో అప్పటి వరకు రెండు కుటుంబాలు ఇచ్చిపుచ్చుకున్న కానుకలను వెనక్కు ఇచ్చేశారు. అనంతరం పెళ్లి కూతురు లేకుండానే ఆ వరుడు ఇంటికి తిరిగి వెళ్లాడని అధికారులు తెలిపారు.