Bridge Collapses In Congo: ప్రారంభించిన మరుక్షణమే కూలిపోయిన బ్రిడ్జీ, రిబ్బన్ కట్‌ చేయగానే కుప్పకూలిన వంతెన, కిందపడిపోయిన అధికారులు, కాంగోలో వింత ఘటన, వైరల్‌గా మారిన వీడియో

ఇందులో మహిళా అధికారికూడా ఉంది. మహిళా అధికారి రిబ్బన్ కట్ చేస్తున్న క్రమంలో బ్రిడ్జిపై (Bridge) జనం గుమ్మిగూడటంతో అది ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో బ్రిడ్జిపై ఉన్నవారంతా కిందపడకుండా తప్పించుకొనేందుకు ఒకరినొకరు నెట్టుకుంటూ పైకొచ్చే ప్రయత్నం చేశారు.

Congo, SEP 07: డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో ఓ వంతెనను అధికారులు ప్రారంభిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఊహించని ఈ పరిణామంతో బ్రిడ్జిపై (Bridge) ఉన్న అధికారులు వణికిపోయారు. ఒకరిని మరొకరు నెట్టుకుంటూ కూలుతున్న బ్రిడ్జి (Bridge Collapses) నుంచి బయటపడేలా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో బ్రిడ్జిపై ఉన్న ఓ మహిళా అధికారిని భద్రతా సిబ్బంది నడుంపట్టుకొని లాగిపడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Viral) వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరదా కామెంట్లతో నవ్వులు పూయిస్తున్నారు. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో (Republic of Congo)వర్షాకాలంలో వరదలు కారణంగా వాగును దాటేందుకు స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పలుమార్లు విజ్ఞప్తుల అనంతరం అధికారులు ఆ ప్రాంతంలో చొన్నపాటి వంతెన నిర్మించారు.

ఈ వంతెన పూర్తికావడంతో దానిని ప్రారంభించేందుకు అధికారులు వంతెనపైకి వచ్చారు. ఇందులో మహిళా అధికారికూడా ఉంది. మహిళా అధికారి రిబ్బన్ కట్ చేస్తున్న క్రమంలో బ్రిడ్జిపై (Bridge) జనం గుమ్మిగూడటంతో అది ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో బ్రిడ్జిపై ఉన్నవారంతా కిందపడకుండా తప్పించుకొనేందుకు ఒకరినొకరు నెట్టుకుంటూ పైకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మహిళా అధికారిని భద్రతా సిబ్బంది నడుంపట్టుకొని ఒక్కసారిగా లాగి సేఫ్ ప్లేసులో చేర్చారు. మిగిలిన వారు బ్రిడ్జి చిన్నగా కుంగిపోవడంతో కిందపడిపోయారు.  బ్రిడ్జి రెండు ముక్కలుగా అయింది.

Video: షాకింగ్ వీడియో, జేసీబీ సహాయంతో నది దాటి స్కూలుకు వెళుతున్న విద్యార్థులు, భారీ వర్షాలతో విలవిలలాడుతున్న కర్ణాటక 

ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బ్రిడ్జి ప్రారంభం రోజే ఇలా కుంగిపోవడంతో నిర్మాణ నాణ్యతపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు నవ్వులు పూయిస్తూ రీ కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ రిబ్బన్ ఒకదానితో ఒకటి వంతెనను పట్టుకున్నట్లుగా ఉంది అంటూ పేర్కొన్నాడు. మరో నెటిజన్.. అందరూ తేలికైనోల్లే ఆ బ్రిడ్జిపై ఉన్నారు.. వ్యంగ్యంగా రీ ట్వీట్ చేశాడు.