Winter Session of Parliament Today: నేటి నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కీలక బిల్లులు ముందుకు
ఈ నెల 22వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నాయి. వాటిని తిప్పికొట్టేందుకు అధికార బీజేపీ వ్యూహాలకు పదునుపెట్టింది.
Newdelhi, Dec 4: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Winter session of Parliament) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నాయి. వాటిని తిప్పికొట్టేందుకు అధికార బీజేపీ (BJP) వ్యూహాలకు పదునుపెట్టింది. పార్లమెంట్‌లో (Parliament) ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ సమావేశాలు వాడీవేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.
సభ ముందుకు కీలక బిల్లులు..
భారత శిక్షాస్మృతి(ఐపీసీ), సీఆర్‌పీసీ, సాక్షాధారాల చట్టం స్థానంలో తీసుకురానున్న మూడు కొత్త బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదింపజేసుకోవాలని మోదీ సర్కారు భావిస్తున్నది. అలాగే ఎన్నికల కమిషనర్ల నియామకాల ప్యానల్ నుంచి సీజేఐని తప్పించే బిల్లు కూడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నది.