Forehead Skin Looking Like Plastic: పాలమీగడ లాంటి నుదురు ఆమెది.. అయితే, ప్లాస్టిక్‌లా మారిపోతుంది ఎందుకు?
కారణం చెప్పేసిన వైద్యులు.. ఏమిటా కారణం?
London, August 23: బ్రిటన్‌కు (Britain) చెందిన బ్యూటీషియన్ సిరిన్ మురాద్.. కొద్ది రోజుల క్రితం ఓ విహారయాత్రకు వెళ్ళారు. ఓ పూల్ (Pool) వద్ద కూర్చొని ఎండలో కాసేపు కునుకుతీశారు. 30 నిమిషాలకు మేల్కొన్న తర్వాత నుదురు (Forehead), చెంపలు (Cheeks) కాస్త మండినట్లు అనిపించడంతో ఆమె ఆ ప్రాంతాల్లో వేళ్ళతో తడిమింది. నుదుటిపై చర్మం ప్లాస్టిక్‌లా తయారైనట్టు తెలిసి కంగుతిన్నది. అయినప్పటికీ, ఆమె వైద్యులను సంప్రదించలేదు.
కోడి కూస్తోందని కేసు పెట్టారు.. ఇంతకీ ఆ కోడి ఏ రేంజు సౌండ్ తో కూస్తుందంటే?
కొద్దిరోజులకు ఆమె ముఖం మొత్తం పగుళ్లు తేలినట్లు మారింది. అయితే.. ప్రస్తుతం కోలుకున్నానని, కొన్ని జాగ్రత్తలు పాటించడంతో తిరిగి ఒకప్పటిలా మారిపోయాయని ఫేస్‌బుక్‌లో నాటి, నేటి ఫొటోలను పంచుకుంది సిరిన్. కాగా, ఎండలో వెళితే అందరికి అలా జరగదని, క్యాన్సర్ (Cancer) ఉన్నవారు ఆ తరహా సమస్యలు ఎదుర్కొంటారని వైద్యులు (Doctors) పేర్కొంటున్నారు.