source: pixabay

Newdelhi, Feb 22: గుండె (Heart Disease) సంబంధిత ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో గుండె జబ్బుల ముప్పు తగ్గించే బియ్యం (Rice), గోధుమల రకాలను చైనా పరిశోధకులు అభివృద్ది చేశారు. గుండె జబ్బుల ముప్పును తగ్గించే కోఎన్‌ జైమ్‌ క్యూ10 అనే రకమైన యాంటీఆక్సిడెంట్‌ ను ఈ వరి, గోధుమ రకాలు కలిగి ఉంటాయని పరిశోధకులు తెలిపారు. సీఓక్యూ10, యుబిక్వినోన్‌ అని కూడా పిలిచే ఈ యాంటీఆక్సిడెంట్‌ ను మానవ శరీరం సహజంగానే ఉత్పత్తి చేస్తుందని, వయసు పెరుగే కొద్దీ, శరీరంలో దీని ఉత్పత్తి తగ్గిపోయి, గుండెజబ్బుల ముప్పు పెరుగుతుందని చెప్పారు. 134 రకాల వరి, గోధుమ వంగడాలపై అధ్యయనం చేసిన తర్వాత, సీఓక్యూ10 ఉత్పత్తి చేసేలా జన్యుపరమైన మార్పులు చేసిన కొత్త రకాలను అభివృద్ధి చేసినట్టు తెలిపారు.

ఫ్రీగా చికెన్‌ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్‌, హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఎగబడ్డ జనం, గంటలోనే 2500 గుడ్లు ఖతం

కవలలకు జన్మనిచ్చే స్త్రీలకు గుండె జబ్బుల ప్రమాదం

కవలలకు జన్మనిచ్చే స్త్రీలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుందని యూరోపియన్ హార్ట్ జర్నల్‌ లో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడైంది. కవలలకు జన్మనిచ్చిన మహిళలు తల్లులైన ఒక సంవత్సరం లోపు గుండె జబ్బుల కారణంగా ఆసుపత్రిలో చేరే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. గర్భధారణ సమయంలో అలాంటి స్త్రీలకు అధిక రక్తపోటు సమస్యలు ఉంటే కవలలు పుట్టిన తర్వాత గుండె జబ్బుల ప్రమాదం మరింత పెరుగుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది.

హైదరాబాద్ లోనే కాదు.. గుంటూరులోనూ ఫ్రీగా వేడి వేడి చికెన్‌ సప్లయ్.. ఆవురావురుమంటూ తిన్న జనం.. చికెన్ మేళాలు పెట్టి మరీ వండిన చికెన్ ను ఉచితంగా ఎందుకు వడ్డిస్తున్నారంటే? (వీడియో)