FIA Formula E World Championship 2023: సొంత గడ్డపై పోటీ, మంత్రి కేటీఆర్‌కి థ్యాంక్స్ చెప్పిన ఆనంద్ మహీంద్రా, ఈ నెల 11న ఫార్ములా ఈ- ప్రిక్స్ రేసింగ్

దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా హైదరాబాద్ లో జరిగే ఫార్ములా ఈ- ప్రిక్స్ రేసింగ్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.దీనికి ప్రధాన కారణం ఆనంద్ మహీంద్రా జట్టు మహీంద్రా రేసింగ్ ఈ పోటీల్లో పాల్గొనడమే. ప్రపంచమంతా పోటీ పడి వచ్చిన మహీంద్రా రేసింగ్ జట్టు.. చివరికి సొంత గడ్డపై పోటీల్లో పాల్గొనడం పట్ల తాను ఎంతో ఉత్సాహంతో ఉన్నట్టు ఆనంద్ మహీంద్రా ప్రకటించారు.

Anand Mahindra (Photo-Twitter/@Anand Mahindra)

దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా హైదరాబాద్ లో జరిగే ఫార్ములా ఈ- ప్రిక్స్ రేసింగ్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.దీనికి ప్రధాన కారణం ఆనంద్ మహీంద్రా జట్టు మహీంద్రా రేసింగ్ ఈ పోటీల్లో పాల్గొనడమే. ప్రపంచమంతా పోటీ పడి వచ్చిన మహీంద్రా రేసింగ్ జట్టు.. చివరికి సొంత గడ్డపై పోటీల్లో పాల్గొనడం పట్ల తాను ఎంతో ఉత్సాహంతో ఉన్నట్టు ఆనంద్ మహీంద్రా ప్రకటించారు.

ఫార్ములా- ఈ రేసింగ్ ని..ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ గా పిలుస్తుంటారు. ఎలక్ట్రిక్ రేసింగ్ కార్ల పోటీ ఇది. ఒకే సీటర్ వాహనాల మధ్య పోటీ ఉంటుంది. ఎఫ్ఐఏ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ లోని నెక్లస్ రోడ్డులో గ్రీన్కో హైదరాబాద్ ఈ-ప్రిక్స్ పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. ఈ నెల 11వ తేదీన మొదలు కానున్నాయి.

11 జట్లు ప్రపంచం నలుమూలల నుంచి ఈ పోటీలకు తరలివస్తున్నాయి.ఈ సందర్భంగా ఎనిమిదేళ్ల ప్రపంచవ్యాప్త రేసింగ్ తర్వాత అంతిమంగా మాతృదేశంలో రేసింగ్ లో పాల్గొంటున్నాం. ఎఫ్ఐఏ ఫార్ములా ఈ మొదటిసారి భారత్ కు వస్తోంది. కేటీఆర్ బీఆర్ఎస్ కు, గ్రీన్కోకు ఈ విషయంలో ధన్యవాదాలు’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

Here's Mahindra Tweet

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement