Maruti Brezza Sales Cross 1 MN Units: అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించిన మారుతీ బ్రెజ్జా కారు, ఏకంగా 10 లక్షల మంది కొనేశారని తెలిపిన కంపెనీ

భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అంటే ఏడు సంవత్సరాల ఎనిమిది నెలలు కాలంలో 10 లక్షల కార్లు విక్రయించినట్లు మారుతి సుజుకి వెల్లడించింది.

Maruti Suzuki India (MSIL) MD & CEO Hisashi Takeuchi And Senior Executive Director, Marketing & Sales, Shashank Srivastava (R) At The Launch Of The New And Techy Brezza, In Gurugram (Photo: PTI)

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'మారుతి సుజుకి' (Maruti Suzuki) 'బ్రెజ్జా' (Brezza) విక్రయాల పరంగా ఓ సరికొత్త రికార్డు నెలకొల్పింది. భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అంటే ఏడు సంవత్సరాల ఎనిమిది నెలలు కాలంలో 10 లక్షల కార్లు విక్రయించినట్లు మారుతి సుజుకి వెల్లడించింది.కంపెనీ 9 లక్షల యూనిట్లను విక్రయించిన తరువాత కేవలం ఎనిమిది నెలల్లో మరో లక్ష యూనిట్లను విక్రయించినట్లు సమాచారం.

దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సగటు నెలవారీ అమ్మకాలు 13,921 యూనిట్లు లేదా వారానికి 3480 లేదా ప్రతిరోజూ 497 యూనిట్లు అని తెలుస్తోంది.ఈ ఏడాది మార్చిలో CNG వేరియంట్‌ని ప్రవేశపెట్టిన తరువాత అమ్మకాలు మరింత వేగవంతమయ్యాయి. అంతకు ముందు బ్రెజ్జా ప్రత్యర్థి నెక్సాన్ వల్ల అమ్మకాలు కొంత మందగించాయి. కానీ 2022 - 23 ఆర్ధిక అసంవత్సరంలో బ్రెజ్జా అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది.

Here's News