Maruti Suzuki Ertiga (PIC @ X)

Mumbai, FEB 12: దేశంలోని అత్యంత సక్సెస్‌ఫుల్‌ ఎంపీవీ కార్లలో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) ఒకటి. ఈ కారు ధర ఈ నెల నుంచి రూ.15 వేలు పెరిగింది. మారుతి సుజుకి ఎర్టిగా ఎల్‌ఎక్స్‌ఐ (LXI), వీఎక్స్‌ఐ (VXI), జడ్‌ఎక్స్‌ఐ (ZXI), జడ్‌ఎక్స్‌ఐ ప్లస్‌ (ZXI Plus) వేరియంట్ల ధరలు పెరిగాయి. ఎర్టిగా కార్ల ధరల పెరుగుదలకు మారుతి సుజుకి ఎటువంటి కారణం చెప్పలేదు. త్రీ-రో మారుతి సుజుకి ఎర్టిగా కారు ధర రూ.10 వేలు పెరిగింది. ఎంట్రీ లెవల్‌ ఎల్‌ఎక్స్‌ఐ (ఓ) వేరియంట్‌ రూ.15 వేలు వృద్ధి చెందింది. దీంతో మారుతి సుజుకి ఎర్టిగా కారు ధర రూ.8.84 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌) పలుకుతుంది. మిగతా అన్ని వేరియంట్లు రూ.10 వేలు పెరుగుతాయి.

Mahindra BE 6: ఎలక్ట్రిక్ SUV విభాగంలో సవాల్ విసరబోతున్న మహీంద్రా బీఈ6, సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో బెస్ట్ ఫీచర్లు, వేరియంట్లు ఇవిగో..  

మోడల్‌ – ధర (రూ. లక్షల్లో)

ఎర్టిగా ఎల్‌ఎక్స్‌ఐ (ఓ) – రూ.8.84 లక్షలు.

ఎర్టిగా వీఎక్స్‌ఐ (ఓ) – రూ. 9.93 లక్షలు.

ఎర్టిగా జడ్‌ఎక్స్‌ఐ (ఓ) – రూ.11.03 లక్షలు

ఎర్టిగా జడ్‌ఎక్స్‌ ఐ + – రూ. 11.73 లక్షలు

ఎర్టిగా వీఎక్స్‌ఐ ఏటీ – రూ.11.33 లక్షలు

ఎర్టిగా జడ్‌ఎక్స్‌ఐ ఏటీ – రూ.12.43 లక్షలు

ఎర్టిగా జడ్‌ఎక్స్‌ఐ ప్లస్‌ ఏటీ – రూ.13.13 లక్షలు

ఎర్టిగా వీఎక్స్‌ఐ (ఓఏ) సీఎన్జీ – రూ.10.88 లక్షలు

ఎర్టిగా జడ్‌ఎక్స్ఐ (ఓ) సీఎన్జీ – రూ. 11.98 లక్షలు

మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) రెండు పవర్‌ ట్రైన్‌ ఆప్షన్లు – 1.5-లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌, సీఎన్జీ వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్‌ వర్షన్‌ ఇంజిన్ గరిష్టంగా 6,000 ఆర్పీఎం వద్ద 101.6 బీహెచ్‌పీ విద్యుత్‌, 4,400 ఆర్పీఎం వద్ద 136.8 ఎన్‌ఎం టార్క్‌ వెలువరిస్తుంది. ఈ కారు 5- స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ లేదా 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆప్షన్లలో లభిస్తుంది. సీఎన్జీ ఇంజిన్ గరిష్టంగా 5,500 ఆర్పీఎం వద్ద 86.6 బీహెచ్‌పీ, 4,200 ఆర్పీఎం వద్ద 121.5 టార్క్‌ వెలువరిస్తుంది. సీఎన్జీ వర్షన్ కారు 5-స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో లభిస్తుంది.