Elon Musk: భారత ప్రభుత్వంతో అనేక సమస్యలు ఉన్నాయి, అందుకే మా కార్లు రావడం లేట్ అవుతోంది, ఇండియాలో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ఆగమనంపై స్పందించిన ఎలాన్ మస్క్

2019లోనే భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావాలని టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ భావించారు. అయితే ఇప్పటికీ ఆయన కార్యాచరణ వాస్తవ రూపం దాల్చలేదు. భారత ప్రభుత్వంతో చాలా సమస్యలు ఉన్నాయని... ఇప్పటికీ వాటిని పరిష్కరించుకునేందుకు పని చేస్తున్నామని మస్క్ తెలిపారు.

Elon Musk (Photo Credits: Getty Images)

2019లోనే భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావాలని టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ భావించారు. అయితే ఇప్పటికీ ఆయన కార్యాచరణ వాస్తవ రూపం దాల్చలేదు. భారత ప్రభుత్వంతో చాలా సమస్యలు ఉన్నాయని... ఇప్పటికీ వాటిని పరిష్కరించుకునేందుకు పని చేస్తున్నామని మస్క్ తెలిపారు. భారత్ లో టెస్లా కార్ లాంచింగ్ విషయంలో ఏమైనా అప్ డేట్ ఉందా? అనే ప్రశ్నకు బదులుగా ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలోని అధికారులతో గత నాలుగేళ్లుగా ఎలాన్ మస్క్ చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయితే స్థానికంగా ఫ్యాక్టరీని నెలకొల్పాలనే కండిషన్ తో పాటు దిగుమతులపై వంద శాతం సుంకం విధించడంతో మస్క్ కల ఇంత వరకు నెరవేరలేదు. కార్ల ఉత్పాదన ప్లాన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇవ్వాలని కూడా కేంద్రం కండిషన్ పెట్టింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement