Microsoft Bank Services Disruptions: పది బ్యాంకులపై మైక్రో సాఫ్ట్ విండోస్ ప్రభావం.. ఆర్బీఐ ప్రకటన
అయితే, ఈ సమస్య కారణంగా దేశంలో 10 బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై స్వల్ప ప్రభావం పడిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
Hyderabad, July 20: మైక్రోసాఫ్ట్ (Microsoft) విండోస్ లో తాజాగా సాంకేతిక లోపం తలెత్తి ప్రపంచం దాదాపుగా స్తంభించే పరిస్థితి నెలకొనడం తెలిసిందే. అయితే, ఈ సమస్య కారణంగా దేశంలో 10 బ్యాంకులు (Banks), ఎన్‌బీఎఫ్‌సీలపై స్వల్ప ప్రభావం పడిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే ఇది కేవలం స్వల్ప అంతరాయమేనని తెలిపింది. వాటిలో కొన్నిటిని ఇప్పటికే పరిష్కరించినట్లు వెల్లడించింది. కాగా, ఐసీఐసీఐ, హెచ్ డీ ఎఫ్ సీ తదితర బ్యాంకు సేవల్లో కాసేపు అంతరాయాన్ని ఎదుర్కొన్నట్టు నెట్టింట్లో పోస్టులు కనిపించాయి.
‘ఎక్స్’లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా ప్రధాని మోదీ.. ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)