TATA Steal Layoffs: కొనసాగుతున్న కోతలు.. 2,800 మంది టాటా స్టీల్ ఉద్యోగులపై వేటు
టాటా గ్రూప్ లో కూడా ఉద్యోగుల కోత కొనసాగుతున్నది. బ్రిటన్ లోని సౌత్ వేల్స్, పోర్ట్ టాల్బోట్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ లను మూసివేయాలని టాటా స్టీల్ నిర్ణయించింది. దీంతో దాదాపు 2,800 మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారు.
London, Jan 20: టాటా గ్రూప్ (TATA Group) లో కూడా ఉద్యోగుల కోత (Layoffs) కొనసాగుతున్నది. బ్రిటన్ లోని (Britain) సౌత్ వేల్స్, పోర్ట్ టాల్బోట్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ లను మూసివేయాలని టాటా స్టీల్ నిర్ణయించింది. దీంతో దాదాపు 2,800 మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారు. రానున్న 18 నెలల్లో 2,500 మందిని తొలగిస్తామని, మిగిలిన వారిని రానున్న మూడేళ్లలో తొలగిస్తామని ఆ సంస్థ తెలిపింది. దీని కోసం అవసరమైన చట్టపరమైన సంప్రదింపులను ప్రారంభించనున్నట్లు తెలిపింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)